Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #87 Translated in Telugu

وَإِذْ أَخَذْنَا مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ لَا تَعْبُدُونَ إِلَّا اللَّهَ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا وَذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَقُولُوا لِلنَّاسِ حُسْنًا وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ ثُمَّ تَوَلَّيْتُمْ إِلَّا قَلِيلًا مِنْكُمْ وَأَنْتُمْ مُعْرِضُونَ
మరియు మేము ఇస్రాయీలు సంతతి వారి నుండి ఇలా తీసుకున్న వాగ్దానం (జ్ఞప్తికి తెచ్చుకోండి): మీరు అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించకూడదు. మరియు తల్లిదండ్రులను, బంధువులను, అనాథులను, యాచించని పేదవారిని ఆదరించాలి. మరియు ప్రజలను సహృదయంతో పలకరించాలి, నమాజ్ ను స్థాపించాలి మరియు జకాత్ ఇవ్వాని." అటు పిమ్మట మీలో కొందరు తప్ప, మిగతా వారంతా (తమ వాగ్దానం నుండి) తిరిగి పోయారు. మీరంతా విముఖులైపోయే వారే
وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ لَا تَسْفِكُونَ دِمَاءَكُمْ وَلَا تُخْرِجُونَ أَنْفُسَكُمْ مِنْ دِيَارِكُمْ ثُمَّ أَقْرَرْتُمْ وَأَنْتُمْ تَشْهَدُونَ
మరియు మేము మీ నుండి తీసుకున్న మరొక వాగ్దానాన్ని (జ్ఞాపకం చేసుకోండి); మీరు మీ (తోటివారి) రక్తాన్ని చిందిచగూడదని మరియు మీ వారిని, వారి ఇండ్ల నుండి పారద్రోల గూడదని! అప్పుడు మీరు దానికి ఒప్పుకున్నారు. మరియు దానికి స్వయంగా మీరే సాక్షులు
ثُمَّ أَنْتُمْ هَٰؤُلَاءِ تَقْتُلُونَ أَنْفُسَكُمْ وَتُخْرِجُونَ فَرِيقًا مِنْكُمْ مِنْ دِيَارِهِمْ تَظَاهَرُونَ عَلَيْهِمْ بِالْإِثْمِ وَالْعُدْوَانِ وَإِنْ يَأْتُوكُمْ أُسَارَىٰ تُفَادُوهُمْ وَهُوَ مُحَرَّمٌ عَلَيْكُمْ إِخْرَاجُهُمْ ۚ أَفَتُؤْمِنُونَ بِبَعْضِ الْكِتَابِ وَتَكْفُرُونَ بِبَعْضٍ ۚ فَمَا جَزَاءُ مَنْ يَفْعَلُ ذَٰلِكَ مِنْكُمْ إِلَّا خِزْيٌ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ وَيَوْمَ الْقِيَامَةِ يُرَدُّونَ إِلَىٰ أَشَدِّ الْعَذَابِ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
ఆ తరువాత మీరో ఒకరినొకరు చంపుకునే వారు. మరియు మీరు మీలోని ఒక వర్గం వారిని వారి ఇండ్ల నుండి తరిమేవారు. మరియు వారికి అన్యాయం చేయటంలోనూ మరియు వారిపై దౌర్జన్యం చేయటంలోనూ, (వారి విరోధులకు) తోడ్పడేవారు. మరియు వారు (శతృవుల చేతిలో) ఖైదీలై మీ వద్దకు వచ్చినపుడు మీరు వారిని విమోచనాధనం ఇచ్చి విడిపించేవారు. మరియు (వాస్తవానికి) వారిని తరమటం మీకు నిషిద్ధం చేయబడింది. ఏమీ? మీరు గ్రంథంలోని కొన్ని విషయాలను విశ్వసించి, మరి కొన్నింటిని తిరస్కరిస్తారా? మీలో ఇలా చేసే వారికి, ఇహలోక జీవితంలో అవమానమూ మరియు పునరుత్థాన దినమున మిమ్మల్ని కఠిన శిక్షకు గురి చేయటం తప్ప మరెలాంటి ప్రతిఫలం ఉంటుంది? మరియు అల్లాహ్ మీ కర్మల విషయంలో నిర్లక్షంగా లేడు
أُولَٰئِكَ الَّذِينَ اشْتَرَوُا الْحَيَاةَ الدُّنْيَا بِالْآخِرَةِ ۖ فَلَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنْصَرُونَ
ఇలాంటి వారే పరలోకానికి బదులుగా ఇహలోక జీవితాన్ని కొనేవారు! కావున వీరికి పడే శిక్ష తగ్గించబడదు మరియు వీరికి ఎలాంటి సహాయమూ లభించదు
وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَقَفَّيْنَا مِنْ بَعْدِهِ بِالرُّسُلِ ۖ وَآتَيْنَا عِيسَى ابْنَ مَرْيَمَ الْبَيِّنَاتِ وَأَيَّدْنَاهُ بِرُوحِ الْقُدُسِ ۗ أَفَكُلَّمَا جَاءَكُمْ رَسُولٌ بِمَا لَا تَهْوَىٰ أَنْفُسُكُمُ اسْتَكْبَرْتُمْ فَفَرِيقًا كَذَّبْتُمْ وَفَرِيقًا تَقْتُلُونَ
మరియు వాస్తవంగా మేము మూసాకు గ్రంథాన్ని (తౌరాత్ ను) ప్రసాదించాము మరియు అతని తర్వాత వరుసగా ప్రవక్తలను పంపాము. మరియు మర్యమ్ కుమారుడైన ఈసాకు (ఏసుకు) స్పష్టమైన సూచనలను ఇచ్చాము మరియు పరిశుద్ధాత్మ (రూహుల్ ఖుదుస్) తో అతనిని బలపరిచాము. ఏమీ? మీ మనోవాంఛలకు ప్రతికూలంగా ఉన్న దాన్ని తీసుకుని ఏ ప్రవక్త అయినా మీ వద్దకు వస్తే, మీరు వారి పట్ల దురహంకారంతో ప్రవర్తించలేదా? వారిలో కొందరిని మీరు అసత్యవాదులన్నారు, మరి కొందరిని చంపారు

Choose other languages: