Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #66 Translated in Telugu

إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَادُوا وَالنَّصَارَىٰ وَالصَّابِئِينَ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَعَمِلَ صَالِحًا فَلَهُمْ أَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
నిశ్చయంగా, విశ్వసించిన వారు (ముస్లింలు) కానీ, (ఇస్లాంకు పూర్వపు) యూదులు కానీ, క్రైస్తవులు కానీ, సాబీయూలు కానీ (ఎవరైనా సరే) ! అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసించి, సత్కార్యాలు చేసే వారికి, వారి ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం ఉంటుంది మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా
وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّورَ خُذُوا مَا آتَيْنَاكُمْ بِقُوَّةٍ وَاذْكُرُوا مَا فِيهِ لَعَلَّكُمْ تَتَّقُونَ
మరియు (ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా!) మేము తూర్ పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి, మీ చేత చేయించిన గట్టి వాగ్దానాన్ని (జ్ఞప్తికి తెచ్చుకోండి)! అప్పుడు మేము: మీకు ప్రసాదిస్తున్న దానిని (గ్రంథాన్ని) దృఢంగా పట్టుకోండి, అందులో ఉన్నదంతా జ్ఞాపకం ఉంచుకోండి, బహుశా మీరు భయభక్తులు గలవారు కావచ్చు!" అని అన్నాము
ثُمَّ تَوَلَّيْتُمْ مِنْ بَعْدِ ذَٰلِكَ ۖ فَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ لَكُنْتُمْ مِنَ الْخَاسِرِينَ
ఆ పిదప కూడా మీరు వెనుదిరిగి పోయారు. అయినప్పటికీ అల్లాహ్ యొక్క అనుగ్రహం మరియు ఆయన కరుణ మీపై లేకుంటే, మీరు నష్టానికి గురైనవారిలో చేరేవారు
وَلَقَدْ عَلِمْتُمُ الَّذِينَ اعْتَدَوْا مِنْكُمْ فِي السَّبْتِ فَقُلْنَا لَهُمْ كُونُوا قِرَدَةً خَاسِئِينَ
మరియు శనివారం (సబ్త్) శాసనం ఉల్లంఘించిన మీ వారి గాథ మీకు బాగా తెలుసు. మేము వారిని: నీచులైన కోతులు కండి!" అన్ని అన్నాము
فَجَعَلْنَاهَا نَكَالًا لِمَا بَيْنَ يَدَيْهَا وَمَا خَلْفَهَا وَمَوْعِظَةً لِلْمُتَّقِينَ
ఈ విధంగా మేము దానిని (వారి ముగింపును) ఆ కాలం వారికీ మరియు భావితరాల వారికీ ఒక గుణపాఠంగానూ, దైవభీతి గలవారికి ఒక హితోపదేశంగానూ చేశాము

Choose other languages: