Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #193 Translated in Telugu

يَسْأَلُونَكَ عَنِ الْأَهِلَّةِ ۖ قُلْ هِيَ مَوَاقِيتُ لِلنَّاسِ وَالْحَجِّ ۗ وَلَيْسَ الْبِرُّ بِأَنْ تَأْتُوا الْبُيُوتَ مِنْ ظُهُورِهَا وَلَٰكِنَّ الْبِرَّ مَنِ اتَّقَىٰ ۗ وَأْتُوا الْبُيُوتَ مِنْ أَبْوَابِهَا ۚ وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ
(ఓ ప్రవక్తా!) వారు నిన్ను మారే చంద్రుని (రూపాలను) గురించి అడుగుతున్నారు. నీవు వారితో ఇలా అను: అవి ప్రజలకు కాలగణనను మరియు హజ్జ్ దినాలను తెలియజేస్తాయి." మీరు మీ ఇళ్ళలోకి వాటి వెనుక భాగం నుండి ప్రవేశించడం ఋజువర్తన (బిర్ర్) కాదు, దైవభీతి కలిగి ఉండటమే ఋజువర్తన (బిర్ర్). కనుక మీరు ఇండ్లలో వాటి ద్వారాల నుండియే ప్రవేశించండి. మరియు మీరు సాఫల్యం పొందటానికి అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి
وَقَاتِلُوا فِي سَبِيلِ اللَّهِ الَّذِينَ يُقَاتِلُونَكُمْ وَلَا تَعْتَدُوا ۚ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمُعْتَدِينَ
మరియు మీతో, పోరాడే వారితో, మీరు అల్లాహ్ మార్గంలో పోరాడండి. కాని హద్దులను అతిక్రమించకండి. నిశ్చయంగా, అల్లాహ్ హద్దులను అతిక్రమించేవారిని ప్రేమించడు
وَاقْتُلُوهُمْ حَيْثُ ثَقِفْتُمُوهُمْ وَأَخْرِجُوهُمْ مِنْ حَيْثُ أَخْرَجُوكُمْ ۚ وَالْفِتْنَةُ أَشَدُّ مِنَ الْقَتْلِ ۚ وَلَا تُقَاتِلُوهُمْ عِنْدَ الْمَسْجِدِ الْحَرَامِ حَتَّىٰ يُقَاتِلُوكُمْ فِيهِ ۖ فَإِنْ قَاتَلُوكُمْ فَاقْتُلُوهُمْ ۗ كَذَٰلِكَ جَزَاءُ الْكَافِرِينَ
వారు, మీకు ఎక్కడ ఎదురైతే అక్కడనే వారిని చంపండి. మరియు వారు మిమ్మల్ని ఎచ్చటి నుండి తరిమి వేశారో, మీరు కూడా వారిని అచ్చటి నుండి తరిమి వేయండి. మరియు సత్యధర్మానికి అడ్డుగా నిలవటం (ఫిత్నా), చంపటం కంటే ఘోరమైనది. మస్జిద్ అల్ హరామ్ వద్ద వారు మీతో యుద్ధం చేయనంత వరకు మీరు వారితో అక్కడ యుద్ధం చేయకండి. ఒకవేళ వారే మీతో (ఆ పవిత్ర స్థలంలో) యుద్ధం చేస్తే వారిని వధించండి. ఇదే సత్యతిరస్కారులకు తగిన శిక్ష
فَإِنِ انْتَهَوْا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَحِيمٌ
కానీ, వారు (యుద్ధం చేయటం) మానుకుంటే (మీరు కూడా మానుకోండి). ఎందుకంటే నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత
وَقَاتِلُوهُمْ حَتَّىٰ لَا تَكُونَ فِتْنَةٌ وَيَكُونَ الدِّينُ لِلَّهِ ۖ فَإِنِ انْتَهَوْا فَلَا عُدْوَانَ إِلَّا عَلَى الظَّالِمِينَ
మరియు ఫిత్నా ముగిసిపోయే వరకు మరియు అల్లాహ్ ధర్మం మాత్రమే స్థాపించబడే వరకు మీరు వారితో యుద్ధం చేస్తూ ఉండండి. ఒకవేళ వారు మానుకుంటే, దుర్మార్గులతో తప్ప ఇతరులతో పోరాడకండి

Choose other languages: