Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #172 Translated in Telugu

يَا أَيُّهَا النَّاسُ كُلُوا مِمَّا فِي الْأَرْضِ حَلَالًا طَيِّبًا وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُبِينٌ
ఓ ప్రజలారా! భూమిలోనున్న ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన వాటినే తినండి. మరియు షైతాన్ అడుగుజాడలను అనుసరించకండి. నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు
إِنَّمَا يَأْمُرُكُمْ بِالسُّوءِ وَالْفَحْشَاءِ وَأَنْ تَقُولُوا عَلَى اللَّهِ مَا لَا تَعْلَمُونَ
నిశ్చయంగా, అతడు (షైతాన్) మిమ్మల్ని దుష్కార్యాలు మరియు అశ్లీలమైన పనులు చేయటానికి మరియు అల్లాహ్ ను గురించి మీకు తెలియని మాటలు పలుకటానికి ప్రేరేపిస్తుంటాడు
وَإِذَا قِيلَ لَهُمُ اتَّبِعُوا مَا أَنْزَلَ اللَّهُ قَالُوا بَلْ نَتَّبِعُ مَا أَلْفَيْنَا عَلَيْهِ آبَاءَنَا ۗ أَوَلَوْ كَانَ آبَاؤُهُمْ لَا يَعْقِلُونَ شَيْئًا وَلَا يَهْتَدُونَ
మరియు వారితో: అల్లాహ్ అవతరింపజేసిన వాటిని (ఆదేశాలను) అనుసరించండి!" అని అన్నప్పుడు, వారు: అలా కాదు, మేము మా తండ్రితాతలు అవలంబిస్తూ వచ్చిన పద్ధతినే అనుసరిస్తాము." అని సమాధానమిస్తారు. ఏమీ? వారి తండ్రితాతలు ఎలాంటి జ్ఞానం లేని వారైనప్పటికీ మరియు సన్మార్గం పొందని వారు అయినప్పటికినీ, (వీరు, వారినే అనుసరిస్తారా)
وَمَثَلُ الَّذِينَ كَفَرُوا كَمَثَلِ الَّذِي يَنْعِقُ بِمَا لَا يَسْمَعُ إِلَّا دُعَاءً وَنِدَاءً ۚ صُمٌّ بُكْمٌ عُمْيٌ فَهُمْ لَا يَعْقِلُونَ
మరియు సత్యతిరస్కారుల ఉపమానం, వాటి (ఆ పశువుల) వలే ఉంది; అవి అతడి (కాపరి) అరుపులు వింటాయే (కానీ ఏమీ అర్థం చేసుకోలేవు), అరుపులు మరియు కేకలు వినడం తప్ప. వారు చెవిటివారు, మూగవారు మరియు గ్రుడ్డివారు, కాబట్టి వారు ఏమీ అర్థం చేసుకోలేరు
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُلُوا مِنْ طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ وَاشْكُرُوا لِلَّهِ إِنْ كُنْتُمْ إِيَّاهُ تَعْبُدُونَ
ఓ విశ్వాసులారా! మీరు నిజంగానే కేవలం ఆయన (అల్లాహ్) నే ఆరాధించేవారు అయితే; మేము మీకు జీవనోపాధిగా ఇచ్చిన పరిశుద్ధమైన (ధర్మసమ్మతమైన) వస్తువులనే తినండి మరియు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపండి

Choose other languages: