Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #158 Translated in Telugu

وَلَا تَقُولُوا لِمَنْ يُقْتَلُ فِي سَبِيلِ اللَّهِ أَمْوَاتٌ ۚ بَلْ أَحْيَاءٌ وَلَٰكِنْ لَا تَشْعُرُونَ
మరియు అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని `మృతులు` అనకండి! వాస్తవానికి వారు సజీవులు. కాని మీరది గ్రహించజాలరు
وَلَنَبْلُوَنَّكُمْ بِشَيْءٍ مِنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِنَ الْأَمْوَالِ وَالْأَنْفُسِ وَالثَّمَرَاتِ ۗ وَبَشِّرِ الصَّابِرِينَ
మరియు నిశ్చయంగా మేము, మిమ్మల్ని భయప్రమాదాలకు, ఆకలి బాధలకు, ధన ప్రాణ ఫల (ఆదాయాల) నష్టానికి గురిచేసి పరీక్షిస్తాము. మరియు (ఇలాంటి పరిస్థితులలో) మనఃస్థైర్యంతో ఉండేవారికి శుభవార్తనివ్వు
الَّذِينَ إِذَا أَصَابَتْهُمْ مُصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ
ఎవరైతే విపత్కరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు: నిశ్చయంగా మేము అల్లాహ్ కే చెందినవారము! మరియు మేము ఆయన వైపునకే మరలిపోతాము!" అని అంటారో
أُولَٰئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِنْ رَبِّهِمْ وَرَحْمَةٌ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُهْتَدُونَ
అలాంటి వారికి వారి ప్రభువు నుండి అనుగ్రహాలు మరియు కరణ ఉంటాయి. మరియు వారే సన్మార్గం పొందినవారు
إِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِنْ شَعَائِرِ اللَّهِ ۖ فَمَنْ حَجَّ الْبَيْتَ أَوِ اعْتَمَرَ فَلَا جُنَاحَ عَلَيْهِ أَنْ يَطَّوَّفَ بِهِمَا ۚ وَمَنْ تَطَوَّعَ خَيْرًا فَإِنَّ اللَّهَ شَاكِرٌ عَلِيمٌ
నిశ్చయంగా, `సఫా మరియు మర్వాలు అల్లాహ్ చూపిన చిహ్నాలు. కావున ఎవడు (కఅబహ్) గృహానికి `హజ్జ్ లేక `ఉమ్రా కొరకు పోతాడో, అతడు ఈ రెంటి మధ్య పచార్లు (స`యీ) చేస్తే, అతనికి ఎట్టి దోషం లేదు. మరియు ఎవడైనా స్వేచ్ఛాపూర్వకంగా మంచికార్యం చేస్తే! నిశ్చయంగా, అల్లాహ్ కృతజ్ఞతలను ఆమోదించేవాడు, సర్వజ్ఞుడు

Choose other languages: