Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #12 Translated in Telugu

7:8
وَالْوَزْنُ يَوْمَئِذٍ الْحَقُّ ۚ فَمَنْ ثَقُلَتْ مَوَازِينُهُ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
మరియు ఆ రోజు (కర్మల) తూకం న్యాయంగా జరుగుతుంది. కావున ఎవరి తూనికలు బరువుగా ఉంటాయో అలాంటి వారే సఫలీకృతలు
7:9
وَمَنْ خَفَّتْ مَوَازِينُهُ فَأُولَٰئِكَ الَّذِينَ خَسِرُوا أَنْفُسَهُمْ بِمَا كَانُوا بِآيَاتِنَا يَظْلِمُونَ
మరియు ఎవరి తూనికలు తేలికగా ఉంటాయో, అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేస్తుకున్నవారు. ఎందుకంటే, వారు మా సూచనలను దుర్మార్గంతో తిరస్కరిస్తూ ఉండేవారు
وَلَقَدْ مَكَّنَّاكُمْ فِي الْأَرْضِ وَجَعَلْنَا لَكُمْ فِيهَا مَعَايِشَ ۗ قَلِيلًا مَا تَشْكُرُونَ
మరియు వాస్తవానికి మేము మిమ్మల్ని భూమిలో స్థిరపరచాము. మరియు అందులో మీకు జీవన వసతులను కల్పించాము (అయినా) మీరు కృతజ్ఞత చూపేది చాలా తక్కువ
وَلَقَدْ خَلَقْنَاكُمْ ثُمَّ صَوَّرْنَاكُمْ ثُمَّ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ لَمْ يَكُنْ مِنَ السَّاجِدِينَ
మరియు వాస్తవానికి మేము మిమ్మల్ని సృష్టించాము. పిదప మీ రూపాన్ని తీర్చిదిద్దాము. ఆ పిదప దైవదూతలను: మీరు ఆదమ్ కు సాష్టాంగం (సజ్దా) చేయండి!" అని ఆదేశించగా, ఒక్క ఇబ్లీస్ తప్ప అందరూ సాష్టాంగం (సజ్దా) చేశారు, అతడు సాష్టాంగం చేసేవారిలో చేరలేదు
قَالَ مَا مَنَعَكَ أَلَّا تَسْجُدَ إِذْ أَمَرْتُكَ ۖ قَالَ أَنَا خَيْرٌ مِنْهُ خَلَقْتَنِي مِنْ نَارٍ وَخَلَقْتَهُ مِنْ طِينٍ
(అప్పుడు అల్లాహ్) అన్నాడు: (ఓ ఇబ్లీస్!) నేను ఆజ్ఞాపించినప్పటికీ, సాష్టాంగం చేయకుండా నిన్ను ఆపింది ఏమిటి?" దానికి (ఇబ్లీస్): నేను అతని కంటే శ్రేష్ఠుడను. నీవు నన్ను అగ్నితో సృష్టించావు మరియు అతనిని నీవు మట్టితో సృష్టించావు." అని జవాబిచ్చాడు

Choose other languages: