Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #15 Translated in Telugu

وَلَقَدْ خَلَقْنَاكُمْ ثُمَّ صَوَّرْنَاكُمْ ثُمَّ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ لَمْ يَكُنْ مِنَ السَّاجِدِينَ
మరియు వాస్తవానికి మేము మిమ్మల్ని సృష్టించాము. పిదప మీ రూపాన్ని తీర్చిదిద్దాము. ఆ పిదప దైవదూతలను: మీరు ఆదమ్ కు సాష్టాంగం (సజ్దా) చేయండి!" అని ఆదేశించగా, ఒక్క ఇబ్లీస్ తప్ప అందరూ సాష్టాంగం (సజ్దా) చేశారు, అతడు సాష్టాంగం చేసేవారిలో చేరలేదు
قَالَ مَا مَنَعَكَ أَلَّا تَسْجُدَ إِذْ أَمَرْتُكَ ۖ قَالَ أَنَا خَيْرٌ مِنْهُ خَلَقْتَنِي مِنْ نَارٍ وَخَلَقْتَهُ مِنْ طِينٍ
(అప్పుడు అల్లాహ్) అన్నాడు: (ఓ ఇబ్లీస్!) నేను ఆజ్ఞాపించినప్పటికీ, సాష్టాంగం చేయకుండా నిన్ను ఆపింది ఏమిటి?" దానికి (ఇబ్లీస్): నేను అతని కంటే శ్రేష్ఠుడను. నీవు నన్ను అగ్నితో సృష్టించావు మరియు అతనిని నీవు మట్టితో సృష్టించావు." అని జవాబిచ్చాడు
قَالَ فَاهْبِطْ مِنْهَا فَمَا يَكُونُ لَكَ أَنْ تَتَكَبَّرَ فِيهَا فَاخْرُجْ إِنَّكَ مِنَ الصَّاغِرِينَ
(అప్పుడు అల్లాహ్) ఆజ్ఞాపించాడు: నీవిక్కడ నుండి దిగిపో! ఇక్కడ గర్వపడటం నీకు తగదు, కావున వెళ్ళిపో! నిశ్చయంగా, నీవు నీచులలో చేరావు
قَالَ أَنْظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
(ఇబ్లీస్) ఇలా వేడుకున్నాడు: వారు తిరిగి లేపబడే (పునరుత్థాన) దినం వరకు నాకు వ్యవధినివ్వు
قَالَ إِنَّكَ مِنَ الْمُنْظَرِينَ
(అల్లాహ్) సెలవిచ్చాడు: నిశ్చయంగా, నీకు వ్యవధి ఇవ్వబడుతోంది

Choose other languages: