Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #27 Translated in Telugu

قَالَا رَبَّنَا ظَلَمْنَا أَنْفُسَنَا وَإِنْ لَمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
వారిద్దరూ ఇలా విన్నవించుకున్నారు: మా ప్రభూ! మాకు మేము అన్యాయం చేసుకున్నాము. మరియు నీవు మమ్మల్ని కరుణించకపోతే! మమ్మల్ని క్షమించకపోతే! నిశ్చయంగా, మేము నాశనమై పోయేవారమవుతాము
قَالَ اهْبِطُوا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۖ وَلَكُمْ فِي الْأَرْضِ مُسْتَقَرٌّ وَمَتَاعٌ إِلَىٰ حِينٍ
(అల్లాహ్) అన్నాడు: మీరందరు దిగిపోండి! మీరు ఒకరికొకరు శత్రువులు అవుతారు. మరియు మీరందరికీ ఒక నిర్ణీతకాలం వరకు భూమిలో నివాసం మరియు జీవనోపాధి ఉంటాయి
قَالَ فِيهَا تَحْيَوْنَ وَفِيهَا تَمُوتُونَ وَمِنْهَا تُخْرَجُونَ
ఇంకా ఇలా అన్నాడు: మీరందరూ అందులోనే జీవిస్తారు మరియు అందులోనే మరణిస్తారు మరియు దాని నుండే మరల లేపబడతారు (పురుత్థరింపబడతారు)
يَا بَنِي آدَمَ قَدْ أَنْزَلْنَا عَلَيْكُمْ لِبَاسًا يُوَارِي سَوْآتِكُمْ وَرِيشًا ۖ وَلِبَاسُ التَّقْوَىٰ ذَٰلِكَ خَيْرٌ ۚ ذَٰلِكَ مِنْ آيَاتِ اللَّهِ لَعَلَّهُمْ يَذَّكَّرُونَ
ఓ ఆదమ్ సంతానమా! వాస్తవానికి మేము మీ కొరకు వస్త్రాలను కల్పించాము, అవి మీ మర్మాంగాలను కప్పుతాయి మరియు మీకు అలంకారమిస్తాయి. మరియు దైవభీతియే అన్నింటి కంటే శ్రేష్ఠమైన వస్త్రం. ఇవి అల్లాహ్ సూచనలలో కొన్ని; బహుశా గుణపాఠం నేర్చుకుంటారేమోనని, (వీటిని మీకు వినిపిస్తున్నాము)
يَا بَنِي آدَمَ لَا يَفْتِنَنَّكُمُ الشَّيْطَانُ كَمَا أَخْرَجَ أَبَوَيْكُمْ مِنَ الْجَنَّةِ يَنْزِعُ عَنْهُمَا لِبَاسَهُمَا لِيُرِيَهُمَا سَوْآتِهِمَا ۗ إِنَّهُ يَرَاكُمْ هُوَ وَقَبِيلُهُ مِنْ حَيْثُ لَا تَرَوْنَهُمْ ۗ إِنَّا جَعَلْنَا الشَّيَاطِينَ أَوْلِيَاءَ لِلَّذِينَ لَا يُؤْمِنُونَ
ఓ ఆదమ్ సంతానమా! షైతాన్ మీ తల్లిదండ్రుల నుండి (స్వర్గ) వస్త్రాలను తొలగించి, వారి మర్మాంగాలను వారికి కనబడేటట్లు చేసి వారిని స్వర్గం నుండి వెడలగొట్టినట్లు మిమ్మల్ని కూడా ఆపదకు (ఫిత్నాకు) గురిచేయకూడదు. నిశ్చయంగా, వాడు మరియు వాని సంతతివారు మిమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నారు. కాని, మీరు వారిని చూడలేరు. నిశ్చయంగా, మేము షైతానులను, విశ్వసించని వారికి స్నేహితులుగా చేశాము

Choose other languages: