Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #30 Translated in Telugu

يَا بَنِي آدَمَ قَدْ أَنْزَلْنَا عَلَيْكُمْ لِبَاسًا يُوَارِي سَوْآتِكُمْ وَرِيشًا ۖ وَلِبَاسُ التَّقْوَىٰ ذَٰلِكَ خَيْرٌ ۚ ذَٰلِكَ مِنْ آيَاتِ اللَّهِ لَعَلَّهُمْ يَذَّكَّرُونَ
ఓ ఆదమ్ సంతానమా! వాస్తవానికి మేము మీ కొరకు వస్త్రాలను కల్పించాము, అవి మీ మర్మాంగాలను కప్పుతాయి మరియు మీకు అలంకారమిస్తాయి. మరియు దైవభీతియే అన్నింటి కంటే శ్రేష్ఠమైన వస్త్రం. ఇవి అల్లాహ్ సూచనలలో కొన్ని; బహుశా గుణపాఠం నేర్చుకుంటారేమోనని, (వీటిని మీకు వినిపిస్తున్నాము)
يَا بَنِي آدَمَ لَا يَفْتِنَنَّكُمُ الشَّيْطَانُ كَمَا أَخْرَجَ أَبَوَيْكُمْ مِنَ الْجَنَّةِ يَنْزِعُ عَنْهُمَا لِبَاسَهُمَا لِيُرِيَهُمَا سَوْآتِهِمَا ۗ إِنَّهُ يَرَاكُمْ هُوَ وَقَبِيلُهُ مِنْ حَيْثُ لَا تَرَوْنَهُمْ ۗ إِنَّا جَعَلْنَا الشَّيَاطِينَ أَوْلِيَاءَ لِلَّذِينَ لَا يُؤْمِنُونَ
ఓ ఆదమ్ సంతానమా! షైతాన్ మీ తల్లిదండ్రుల నుండి (స్వర్గ) వస్త్రాలను తొలగించి, వారి మర్మాంగాలను వారికి కనబడేటట్లు చేసి వారిని స్వర్గం నుండి వెడలగొట్టినట్లు మిమ్మల్ని కూడా ఆపదకు (ఫిత్నాకు) గురిచేయకూడదు. నిశ్చయంగా, వాడు మరియు వాని సంతతివారు మిమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నారు. కాని, మీరు వారిని చూడలేరు. నిశ్చయంగా, మేము షైతానులను, విశ్వసించని వారికి స్నేహితులుగా చేశాము
وَإِذَا فَعَلُوا فَاحِشَةً قَالُوا وَجَدْنَا عَلَيْهَا آبَاءَنَا وَاللَّهُ أَمَرَنَا بِهَا ۗ قُلْ إِنَّ اللَّهَ لَا يَأْمُرُ بِالْفَحْشَاءِ ۖ أَتَقُولُونَ عَلَى اللَّهِ مَا لَا تَعْلَمُونَ
మరియు వారు (అవిశ్వాసులు), ఏదైనా అశ్లీలమైన పని చేసినపుడు ఇలా అంటారు: మేము మా తండ్రితాతలను ఈ పద్ధతినే అవలంబిస్తూ ఉండగా చూశాము. మరియు అలా చేయమని అల్లాహ్ యే మమ్మల్ని ఆదేశించాడు." వారితో అను: నిశ్చయంగా, అల్లాహ్ అశ్లీలమైన పనులు చేయమని ఎన్నడూ ఆదేశించడు. ఏమీ? మీకు తెలియని విషయాన్ని గురించి అల్లాహ్ పై నిందలు వేస్తున్నారా
قُلْ أَمَرَ رَبِّي بِالْقِسْطِ ۖ وَأَقِيمُوا وُجُوهَكُمْ عِنْدَ كُلِّ مَسْجِدٍ وَادْعُوهُ مُخْلِصِينَ لَهُ الدِّينَ ۚ كَمَا بَدَأَكُمْ تَعُودُونَ
(ఓ ముహమ్మద్! వారితో) ఇలా అను: నా ప్రభువు న్యాయాన్ని పాటించమని ఆదేశించాడు. మరియు మీరు ప్రతి మస్జిదులో (నమాజ్ లో) మీ ముఖాలను సరిగ్గా (ఆయన వైపునకే) మరల్చుకొని నమాజ్ ను పూర్తి శ్రద్ధతో నిర్వహించండి మరియు ధర్మాన్ని / ఆరాధనను (దీన్ ను) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకొని ఆయనను మాత్రమే ప్రార్థించండి." ఆయన మిమ్మల్ని మొదట సృష్టించినట్లు మీరు తిరిగి సృష్టించబడతారు
فَرِيقًا هَدَىٰ وَفَرِيقًا حَقَّ عَلَيْهِمُ الضَّلَالَةُ ۗ إِنَّهُمُ اتَّخَذُوا الشَّيَاطِينَ أَوْلِيَاءَ مِنْ دُونِ اللَّهِ وَيَحْسَبُونَ أَنَّهُمْ مُهْتَدُونَ
మీలో కొందరికి ఆయన సన్మార్గం చూపించాడు. మరికొందరు మార్గభ్రష్టత్వానికి గురయ్యారు. ఎందుకంటే వాస్తవానికి వారు అల్లాహ్ ను వదలి షైతానులను తమ స్నేహితులుగా చేసుకున్నారు మరియు నిశ్చయంగా, తామే సన్మార్గంపై ఉన్నామని భ్రమలో ఉన్నారు

Choose other languages: