Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #25 Translated in Telugu

وَقَاسَمَهُمَا إِنِّي لَكُمَا لَمِنَ النَّاصِحِينَ
మరియు (షైతాన్) వారిద్దరితో ప్రమాణం చేస్తూ పలికాడు: నిశ్చయంగా, నేను మీ ఇద్దరి శ్రేయోభిలాషిని
فَدَلَّاهُمَا بِغُرُورٍ ۚ فَلَمَّا ذَاقَا الشَّجَرَةَ بَدَتْ لَهُمَا سَوْآتُهُمَا وَطَفِقَا يَخْصِفَانِ عَلَيْهِمَا مِنْ وَرَقِ الْجَنَّةِ ۖ وَنَادَاهُمَا رَبُّهُمَا أَلَمْ أَنْهَكُمَا عَنْ تِلْكُمَا الشَّجَرَةِ وَأَقُلْ لَكُمَا إِنَّ الشَّيْطَانَ لَكُمَا عَدُوٌّ مُبِينٌ
ఈ విధంగా వారిద్దరిని మోసపుచ్చి, తన (పన్నుగడ) వైపునకు త్రిప్పుకున్నాడు. వారిద్దరూ ఆ వృక్షమును (ఫలమును) రుచి చూడగానే వారిద్దరి మర్మాంగాలు వారికి బహిర్గతమయ్యాయి. అప్పుడు వారు తమ (శరీరాల)పై స్వర్గపు ఆకులను కప్పుకోసాగారు. మరియు వారి ప్రభువు వారిద్దరినీ పిలిచి అన్నాడు: ఏమీ? నేను మీ ఇద్దరినీ ఈ చెట్టు వద్దకు పోవద్దని నివారించలేదా? మరియు నిశ్చయంగా, షైతాన్ మీ ఇద్దరి యొక్క బహిరంగ శత్రువని చెప్పలేదా
قَالَا رَبَّنَا ظَلَمْنَا أَنْفُسَنَا وَإِنْ لَمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
వారిద్దరూ ఇలా విన్నవించుకున్నారు: మా ప్రభూ! మాకు మేము అన్యాయం చేసుకున్నాము. మరియు నీవు మమ్మల్ని కరుణించకపోతే! మమ్మల్ని క్షమించకపోతే! నిశ్చయంగా, మేము నాశనమై పోయేవారమవుతాము
قَالَ اهْبِطُوا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۖ وَلَكُمْ فِي الْأَرْضِ مُسْتَقَرٌّ وَمَتَاعٌ إِلَىٰ حِينٍ
(అల్లాహ్) అన్నాడు: మీరందరు దిగిపోండి! మీరు ఒకరికొకరు శత్రువులు అవుతారు. మరియు మీరందరికీ ఒక నిర్ణీతకాలం వరకు భూమిలో నివాసం మరియు జీవనోపాధి ఉంటాయి
قَالَ فِيهَا تَحْيَوْنَ وَفِيهَا تَمُوتُونَ وَمِنْهَا تُخْرَجُونَ
ఇంకా ఇలా అన్నాడు: మీరందరూ అందులోనే జీవిస్తారు మరియు అందులోనే మరణిస్తారు మరియు దాని నుండే మరల లేపబడతారు (పురుత్థరింపబడతారు)

Choose other languages: