Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #206 Translated in Telugu

وَإِخْوَانُهُمْ يَمُدُّونَهُمْ فِي الْغَيِّ ثُمَّ لَا يُقْصِرُونَ
మరియు వారి (షైతాన్ ల) సహోదరులు వారిని తప్పు దారి వైపుకు లాక్కొని పోగోరుతారు మరియు వారు ఏ మాత్రం పట్టు వదలరు
وَإِذَا لَمْ تَأْتِهِمْ بِآيَةٍ قَالُوا لَوْلَا اجْتَبَيْتَهَا ۚ قُلْ إِنَّمَا أَتَّبِعُ مَا يُوحَىٰ إِلَيَّ مِنْ رَبِّي ۚ هَٰذَا بَصَائِرُ مِنْ رَبِّكُمْ وَهُدًى وَرَحْمَةٌ لِقَوْمٍ يُؤْمِنُونَ
మరియు (ఓ ప్రవక్తా!) నీవు వారికి ఏదైనా సూచనను తేలేక పోయినప్పుడు వారు: నీవే స్వయంగా దానిని ఎందుకు (కల్పించుకొని) తేలేదు?" అని అంటారు. వారితో ఇలా అను: నేను కేవలం నా ప్రభువు తరఫు నుండి నాకు పంప బడే సందేశాన్ని (వహీని) మాత్రమే అనుసరించేవాడను. ఇందు (ఈ ఖుర్ఆన్) లో విశ్వసించేవారి కొరకు, మీ ప్రభువు తరఫు నుండి అనేక బోధనలు, మార్గదర్శకత్వం మరియు కారుణ్యమున్నాయి
وَإِذَا قُرِئَ الْقُرْآنُ فَاسْتَمِعُوا لَهُ وَأَنْصِتُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ
మరియు ఖుర్ఆన్ పారాయణం జరిగేటప్పుడు దానిని శ్రద్ధగా వినండి మరియు నిశ్శబ్దంగా ఉండండి, అప్పుడు మీరు కరుణింపబడవచ్చు
وَاذْكُرْ رَبَّكَ فِي نَفْسِكَ تَضَرُّعًا وَخِيفَةً وَدُونَ الْجَهْرِ مِنَ الْقَوْلِ بِالْغُدُوِّ وَالْآصَالِ وَلَا تَكُنْ مِنَ الْغَافِلِينَ
మరియు నీవు నీ మనస్సులో వినయంతో, భయంతో మరియు ఎక్కువ శబ్దంతో గాక (తగ్గు స్వరంతో) ఉదయం మరియు సాయంత్రం నీ ప్రభువును స్మరించు. మరియు నిర్లక్ష్యం చేసేవారిలో చేరకు
إِنَّ الَّذِينَ عِنْدَ رَبِّكَ لَا يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِهِ وَيُسَبِّحُونَهُ وَلَهُ يَسْجُدُونَ ۩
నిశ్చయంగా, నీ ప్రభువుకు దగ్గరగా ఉన్నవారు (దైవదూతలు) తమ ప్రభువును ఆరాధించటానికి అహంభావం చూపరు. మరియు ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు. మరియు ఆయనకే సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటారు

Choose other languages: