Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #22 Translated in Telugu

قَالَ اخْرُجْ مِنْهَا مَذْءُومًا مَدْحُورًا ۖ لَمَنْ تَبِعَكَ مِنْهُمْ لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنْكُمْ أَجْمَعِينَ
(అల్లాహ్) జవాబిచ్చాడు, నీవిక్కడి నుండి అవమానింపబడి, బహిష్కృతుడవై వెళ్ళిపో! వారిలో ఎవరైతే నిన్ను అనుసరిస్తారో! అలాంటి మీ వారి అందరితో నిశ్చయంగా, నేను నరకాన్ని నింపుతాను
وَيَا آدَمُ اسْكُنْ أَنْتَ وَزَوْجُكَ الْجَنَّةَ فَكُلَا مِنْ حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَٰذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ
మరియు : ఓ ఆదమ్! నీవు మరియు నీ భార్య ఈ స్వర్గంలో ఉండండి. మరియు మీద్దరూ మీ ఇచ్ఛానుసారంగా దీనిలోని (ఫలాలను) తినండి. కాని ఈ వృక్షాన్ని సమీపించకండి! అలా చేస్తే మీరు దుర్మార్గులలో చేరి పోతారు
فَوَسْوَسَ لَهُمَا الشَّيْطَانُ لِيُبْدِيَ لَهُمَا مَا وُورِيَ عَنْهُمَا مِنْ سَوْآتِهِمَا وَقَالَ مَا نَهَاكُمَا رَبُّكُمَا عَنْ هَٰذِهِ الشَّجَرَةِ إِلَّا أَنْ تَكُونَا مَلَكَيْنِ أَوْ تَكُونَا مِنَ الْخَالِدِينَ
ఆ పిదప షైతాన్ వారిద్దరి చూపులకు మరుగుగా ఉన్న వారిద్దరి మర్మాంగాలను వారికి బహిర్గతం చేయటానికి, రహస్యంగా వారి చెవులలో అన్నాడు: మీరిద్దరూ దైవదూతలు అయిపోతారని, లేదా మీరిద్దరూ శాశ్వత జీవితాన్ని పొందుతారని మీ ప్రభువు, మీ ఇద్దరినీ ఈ వృక్షం నుండి నివారించాడు
وَقَاسَمَهُمَا إِنِّي لَكُمَا لَمِنَ النَّاصِحِينَ
మరియు (షైతాన్) వారిద్దరితో ప్రమాణం చేస్తూ పలికాడు: నిశ్చయంగా, నేను మీ ఇద్దరి శ్రేయోభిలాషిని
فَدَلَّاهُمَا بِغُرُورٍ ۚ فَلَمَّا ذَاقَا الشَّجَرَةَ بَدَتْ لَهُمَا سَوْآتُهُمَا وَطَفِقَا يَخْصِفَانِ عَلَيْهِمَا مِنْ وَرَقِ الْجَنَّةِ ۖ وَنَادَاهُمَا رَبُّهُمَا أَلَمْ أَنْهَكُمَا عَنْ تِلْكُمَا الشَّجَرَةِ وَأَقُلْ لَكُمَا إِنَّ الشَّيْطَانَ لَكُمَا عَدُوٌّ مُبِينٌ
ఈ విధంగా వారిద్దరిని మోసపుచ్చి, తన (పన్నుగడ) వైపునకు త్రిప్పుకున్నాడు. వారిద్దరూ ఆ వృక్షమును (ఫలమును) రుచి చూడగానే వారిద్దరి మర్మాంగాలు వారికి బహిర్గతమయ్యాయి. అప్పుడు వారు తమ (శరీరాల)పై స్వర్గపు ఆకులను కప్పుకోసాగారు. మరియు వారి ప్రభువు వారిద్దరినీ పిలిచి అన్నాడు: ఏమీ? నేను మీ ఇద్దరినీ ఈ చెట్టు వద్దకు పోవద్దని నివారించలేదా? మరియు నిశ్చయంగా, షైతాన్ మీ ఇద్దరి యొక్క బహిరంగ శత్రువని చెప్పలేదా

Choose other languages: