Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #148 Translated in Telugu

قَالَ يَا مُوسَىٰ إِنِّي اصْطَفَيْتُكَ عَلَى النَّاسِ بِرِسَالَاتِي وَبِكَلَامِي فَخُذْ مَا آتَيْتُكَ وَكُنْ مِنَ الشَّاكِرِينَ
(అల్లాహ్) అన్నాడు: ఓ మూసా ప్రవక్త పదవికి మరియు సంభాషించటానికి - నిశ్చయంగా, నేను ప్రజలందరిలో, నిన్ను ఎన్నుకున్నాను. కావున నేను నీకిచ్చిన దానిని తీసుకొని, కృతజ్ఞులలో చేరు
وَكَتَبْنَا لَهُ فِي الْأَلْوَاحِ مِنْ كُلِّ شَيْءٍ مَوْعِظَةً وَتَفْصِيلًا لِكُلِّ شَيْءٍ فَخُذْهَا بِقُوَّةٍ وَأْمُرْ قَوْمَكَ يَأْخُذُوا بِأَحْسَنِهَا ۚ سَأُرِيكُمْ دَارَ الْفَاسِقِينَ
మరియు మేము అతని కొరకు, ఫలకాల మీద ప్రతి విధమైన ఉపదేశాన్ని ప్రతి వ్యవహారానికి సంబంధించిన వివరాలను వ్రాసి ఇచ్చి, అతనితో (మూసాతో) అన్నాము: వీటిని గట్టిగా పట్టుకో! మరియు వీటి ఉత్తమ ఉపదేశాలను అనుసరించమని నీ జాతి వారిని ఆజ్ఞాపించు. త్వరలోనే నేను అవిధేయుల (ఫాసిఖూన్ ల) నివాసాన్ని మీకు చూపుతాను
سَأَصْرِفُ عَنْ آيَاتِيَ الَّذِينَ يَتَكَبَّرُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَإِنْ يَرَوْا كُلَّ آيَةٍ لَا يُؤْمِنُوا بِهَا وَإِنْ يَرَوْا سَبِيلَ الرُّشْدِ لَا يَتَّخِذُوهُ سَبِيلًا وَإِنْ يَرَوْا سَبِيلَ الْغَيِّ يَتَّخِذُوهُ سَبِيلًا ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ كَذَّبُوا بِآيَاتِنَا وَكَانُوا عَنْهَا غَافِلِينَ
ఏ హక్కూ లేకుండా భూమిపై దురహంకారంతో వ్యవహరించే వారిని నేను నా సూచనల (ఆయాత్ ల) నుండి దూరం చేస్తాను. మరియు వారు ఏ సూచనను (ఆయత్ ను) చూసినా దానిని విశ్వసించరు. ఒకవేళ సక్రమమైన మార్గం వారి ముందుకు వచ్చినా, వారు దానిని అవలంబించరు. కాని వారు తప్పు దారిని చూస్తే దానిని అవలంబిస్తారు. ఎందుకంటే వాస్తవానికి, వారు మా సూచనలను (ఆయాత్ లను) అబద్ధాలని తిరస్కరించారు మరియు వాటి నుండి నిర్లక్ష్యులై ఉన్నారు
وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَلِقَاءِ الْآخِرَةِ حَبِطَتْ أَعْمَالُهُمْ ۚ هَلْ يُجْزَوْنَ إِلَّا مَا كَانُوا يَعْمَلُونَ
మరియు మా సూచనలను (ఆయాత లను) మరియు పరలోక దర్శనాన్ని (పునరుత్థాన దినాన్ని) అబద్ధాలని తిరస్కరించిన వారు చేసిన కర్మలన్నీ వ్యర్థమవుతాయి. ఏమీ? వారు కేవలం తమ కర్మలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా పొందగలరా
وَاتَّخَذَ قَوْمُ مُوسَىٰ مِنْ بَعْدِهِ مِنْ حُلِيِّهِمْ عِجْلًا جَسَدًا لَهُ خُوَارٌ ۚ أَلَمْ يَرَوْا أَنَّهُ لَا يُكَلِّمُهُمْ وَلَا يَهْدِيهِمْ سَبِيلًا ۘ اتَّخَذُوهُ وَكَانُوا ظَالِمِينَ
మరియు మూసా జాతి వారు, అతను పోయిన పిదప తమ ఆభరణాలతో ఒక ఆవు దూడ విగ్రహాన్ని తయారు చేశారు. దానిలో నుండి (ఆవు అరుపు వంటి) ధ్వని వచ్చేది. ఏమీ? అది వారితో మాట్లాడజాలదని మరియు వారికి ఏ విధమైన మార్గదర్శకత్వం చేయజాలదని వారికి తెలియదా? అయినా వారు దానిని (దైవంగా) చేసుకొని పరమ దుర్మార్గులయ్యారు

Choose other languages: