Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #108 Translated in Telugu

وَقَالَ مُوسَىٰ يَا فِرْعَوْنُ إِنِّي رَسُولٌ مِنْ رَبِّ الْعَالَمِينَ
మరియు మూసా అన్నాడు: ఓ ఫిర్ఔన్! నేను నిశ్చయంగా, సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుడను
حَقِيقٌ عَلَىٰ أَنْ لَا أَقُولَ عَلَى اللَّهِ إِلَّا الْحَقَّ ۚ قَدْ جِئْتُكُمْ بِبَيِّنَةٍ مِنْ رَبِّكُمْ فَأَرْسِلْ مَعِيَ بَنِي إِسْرَائِيلَ
అల్లాహ్ ను గురించి సత్యం తప్ప మరే విషయాన్ని పలకని బాధ్యత గలవాడను. వాస్తవానికి, నేను మీ వద్దకు, మీ ప్రభువు తరఫు నుండి స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చాను, కావున ఇస్రాయీల్ సంతతి వారిని నా వెంట పోనివ్వు
قَالَ إِنْ كُنْتَ جِئْتَ بِآيَةٍ فَأْتِ بِهَا إِنْ كُنْتَ مِنَ الصَّادِقِينَ
(ఫిర్ఔన్) అన్నాడు: నీవు ఏదైనా సూచనను తీసుకొని వచ్చి ఉంటే - నీవు సత్యవంతుడవే అయితే - దానిని తీసుకొనిరా
فَأَلْقَىٰ عَصَاهُ فَإِذَا هِيَ ثُعْبَانٌ مُبِينٌ
అప్పుడు (మూసా) తన చేతికర్రను విసిరాడు, అకస్మాత్తుగా అది ఒక స్పష్టమైన పెద్ద సర్పంగా (సుఅబాన్ గా) మారిపోయింది
وَنَزَعَ يَدَهُ فَإِذَا هِيَ بَيْضَاءُ لِلنَّاظِرِينَ
మరియు అతడు తన చేతిని బయటికి తీశాడు. ఇక అది చూసే వారికి తెల్లగా మెరుస్తూ కనిపించింది

Choose other languages: