Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #92 Translated in Telugu

ذَٰلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَنْ يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُمْ مَا كَانُوا يَعْمَلُونَ
ఇదే అల్లాహ్ మార్గదర్శకత్వం. దీని ద్వారా ఆయన తన దాసులలో తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. ఒకవేళ వారు అల్లాహ్ కు సాటి (భాగస్వాములను) కల్పిస్తే, వారు చేసిన సత్కార్యాన్నీ వృథా అయి పోయేవి
أُولَٰئِكَ الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ ۚ فَإِنْ يَكْفُرْ بِهَا هَٰؤُلَاءِ فَقَدْ وَكَّلْنَا بِهَا قَوْمًا لَيْسُوا بِهَا بِكَافِرِينَ
వీరే, మేము గ్రంథాన్ని, వివేకాన్ని మరియు ప్రవక్త పదవిని ప్రసాదించిన వారు. కాని వారు దీనిని (ఈ గ్రంథాన్ని/ప్రవక్త పదవిని) తిరస్కరించి నందుకు! వాస్తవానికి మేము, దీనిని ఎన్నడూ తిరస్కరించని ఇతర ప్రజలను దీనికి కార్యకర్తలుగా నియమించాము
أُولَٰئِكَ الَّذِينَ هَدَى اللَّهُ ۖ فَبِهُدَاهُمُ اقْتَدِهْ ۗ قُلْ لَا أَسْأَلُكُمْ عَلَيْهِ أَجْرًا ۖ إِنْ هُوَ إِلَّا ذِكْرَىٰ لِلْعَالَمِينَ
ఇలాంటి వారే అల్లాహ్ మార్గదర్శకత్వం పొందినవారు. కావున నీవు వారి మార్గాన్నే అనుసరించు. వారితో ఇలా అను: నేను దీనికి బదులుగా మీ నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగను. ఇది కేవలం సర్వ లోకాల (వారి) కొరకు ఒక హితోపదేశం మాత్రమే
وَمَا قَدَرُوا اللَّهَ حَقَّ قَدْرِهِ إِذْ قَالُوا مَا أَنْزَلَ اللَّهُ عَلَىٰ بَشَرٍ مِنْ شَيْءٍ ۗ قُلْ مَنْ أَنْزَلَ الْكِتَابَ الَّذِي جَاءَ بِهِ مُوسَىٰ نُورًا وَهُدًى لِلنَّاسِ ۖ تَجْعَلُونَهُ قَرَاطِيسَ تُبْدُونَهَا وَتُخْفُونَ كَثِيرًا ۖ وَعُلِّمْتُمْ مَا لَمْ تَعْلَمُوا أَنْتُمْ وَلَا آبَاؤُكُمْ ۖ قُلِ اللَّهُ ۖ ثُمَّ ذَرْهُمْ فِي خَوْضِهِمْ يَلْعَبُونَ
మరియు వారు: అల్లాహ్, ఏ మానవుని పైననూ ఏమీ అవతరింపజేయ లేదు." అని పలికినప్పుడు, వారు (అవిశ్వాసులు) అల్లాహ్ ను గురించి తగు రీతిలో అంచనా వేయలేదు. వారిలో ఇలా అను: అయితే! మానవులకు జ్యోతి మరియు మార్గదర్శిని అయిన గ్రంథాన్ని, మూసాపై ఎవరు అవతరింపజేశారు? దానిని మీరు (యూదులు) విడి పత్రాలుగా చేసి (దానిలోని కొంత భాగాన్ని) చుపుతున్నారు మరియు చాలా భాగాన్ని దాస్తున్నారు. మరియు దాని నుండి మీకూ మరియు మీ తండ్రితాతలకూ తెలియని విషయాల జ్ఞానం ఇవ్వబడింది కదా?" ఇంకా ఇలా అను:"అల్లాహ్ యే (దానిని అవతరింపజేశాడు)." ఆ పిదప వారిని, వారి పనికిమాలిన వివాదంలో పడి ఆడుకోనివ్వు
وَهَٰذَا كِتَابٌ أَنْزَلْنَاهُ مُبَارَكٌ مُصَدِّقُ الَّذِي بَيْنَ يَدَيْهِ وَلِتُنْذِرَ أُمَّ الْقُرَىٰ وَمَنْ حَوْلَهَا ۚ وَالَّذِينَ يُؤْمِنُونَ بِالْآخِرَةِ يُؤْمِنُونَ بِهِ ۖ وَهُمْ عَلَىٰ صَلَاتِهِمْ يُحَافِظُونَ
మరియు మేము అవతరింపజేసిన ఈ గ్రంథం (ఖుర్ఆన్) ఎన్నో శుభాలు గలది. ఇది ఇంతకు పూర్వం వచ్చిన గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాలను ధృవపరుస్తోంది మరియు ఇది ఉమ్ముల్ ఖురా (మక్కా) మరియు దాని చుట్టు ప్రక్కలలో ఉన్నవారిని హెచ్చరించటానికి అవతరింపజేయ బడింది. మరియు పరలోకము నందు విశ్వాసమున్న వారు దీనిని (ఈ గ్రంథాన్ని) విశ్వసిస్తారు. మరియు వారు తమ నమాజ్ లను క్రమబద్ధంగా పాటిస్తారు

Choose other languages: