Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #83 Translated in Telugu

إِنِّي وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِي فَطَرَ السَّمَاوَاتِ وَالْأَرْضَ حَنِيفًا ۖ وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ
(ఇంకా ఇలా అన్నాడు): నిశ్చయంగా, నేను ఏక దైవసిద్ధాంతం (సత్యధర్మం) పాటించే వాడనై, నా ముఖాన్ని భుమ్యాకాశాల సృష్టికి మూలాధారి అయిన ఆయన (అల్లాహ్) వైపునకే త్రిప్పు కుంటున్నాను. మరియు నేను అల్లాహ్ కు సాటి (భాగస్వాములు) కల్పించే వారిలో చేరిన వాడను కాను
وَحَاجَّهُ قَوْمُهُ ۚ قَالَ أَتُحَاجُّونِّي فِي اللَّهِ وَقَدْ هَدَانِ ۚ وَلَا أَخَافُ مَا تُشْرِكُونَ بِهِ إِلَّا أَنْ يَشَاءَ رَبِّي شَيْئًا ۗ وَسِعَ رَبِّي كُلَّ شَيْءٍ عِلْمًا ۗ أَفَلَا تَتَذَكَّرُونَ
మరియు అతని జాతివారు అతనితో వాదులాటకు దిగగా! అతను వారితో అన్నాడు: ఏమీ? మీరు నాతో అల్లాహ్ విషయంలో వాదిస్తున్నారా? వాస్తవానికి ఆయనే నాకు సన్మార్గం చూపించాడు. మరియు మీరు ఆయనకు సాటి (భాగస్వాములుగా) కల్పించిన వాటికి నేను భయపడను. నా ప్రభువు ఇచ్ఛ లేనిది (ఏదీ సంభవించదు). నా ప్రభువు సకల వస్తువులను (తన) జ్ఞానంతో ఆవరించి వున్నాడు. ఏమీ? మీరిది గ్రహించలేరా
وَكَيْفَ أَخَافُ مَا أَشْرَكْتُمْ وَلَا تَخَافُونَ أَنَّكُمْ أَشْرَكْتُمْ بِاللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِ عَلَيْكُمْ سُلْطَانًا ۚ فَأَيُّ الْفَرِيقَيْنِ أَحَقُّ بِالْأَمْنِ ۖ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ
మరియు మీరు అల్లాహ్ కు సాటి (భాగస్వాములు)గా కల్పించిన వాటికి నేనెందుకు భయపడాలి? వాస్తవానికి, ఆయన మీకు ఏ విధమైన ప్రమాణం ఇవ్వనిదే, మీరు అల్లాహ్ కు సాటి (భాగస్వాములను) కల్పించి కూడా భయపడటం లేదే? కావున ఈ రెండు పక్షాల వారిలో ఎవరు శాంతి పొందటానికి అర్హులో! మీకు తెలిస్తే చెప్పండి
الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُمْ بِظُلْمٍ أُولَٰئِكَ لَهُمُ الْأَمْنُ وَهُمْ مُهْتَدُونَ
ఎవరైతే విశ్వసించి, తమ విశ్వాసాన్ని షిర్క్ తో కలుషితం చేయరో! అలాంటి వారికే శాంతి ఉంది. మరియు వారే సన్మార్గంలో ఉన్నవారు
وَتِلْكَ حُجَّتُنَا آتَيْنَاهَا إِبْرَاهِيمَ عَلَىٰ قَوْمِهِ ۚ نَرْفَعُ دَرَجَاتٍ مَنْ نَشَاءُ ۗ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌ
మరియు ఇదే మా వాదన, దానిని మేము ఇబ్రాహీమ్ కు, తన జాతివారికి వ్యతిరేకంగా ఇచ్చాము. మేము కోరిన వారికి ఉన్నత స్తానాలకు ప్రసాదిస్తాము. నిశ్చయంగా, నీ ప్రభువు మహా వివేచనాపరుడు, సర్వజ్ఞుడు (జ్ఞాన సంపన్నుడు)

Choose other languages: