Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #165 Translated in Telugu

قُلْ إِنَّنِي هَدَانِي رَبِّي إِلَىٰ صِرَاطٍ مُسْتَقِيمٍ دِينًا قِيَمًا مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۚ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ
వారితో ఇలా అను: నిశ్చయంగా, నా ప్రభువు నాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాడు. అదే సరైన ధర్మం. ఏకదైవ సిద్ధాంతమైన ఇబ్రాహీమ్ ధర్మం. అతను అల్లాహ్ కు సాటి కల్పించే వారిలో చేరినవాడు కాడు
قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(ఇంకా) ఇలా అను: నిశ్చయంగా నా నమాజ్ నా బలి (ఖుర్బానీ), నా జీవితం మరియు నా మరణం, సర్వ లోకాలకు ప్రభువైన అల్లాహ్ కొరకే
لَا شَرِيكَ لَهُ ۖ وَبِذَٰلِكَ أُمِرْتُ وَأَنَا أَوَّلُ الْمُسْلِمِينَ
ఆయనకు ఎలాంటి భాగస్వామి (సాటి) లేడు. మరియు నేను ఇదే విధంగా ఆదేశించబడ్డాను మరియు నేను అల్లాహ్ కు విధేయుడను (ముస్లింను) అయిన వారిలో మొట్టమొదటి వాడను
قُلْ أَغَيْرَ اللَّهِ أَبْغِي رَبًّا وَهُوَ رَبُّ كُلِّ شَيْءٍ ۚ وَلَا تَكْسِبُ كُلُّ نَفْسٍ إِلَّا عَلَيْهَا ۚ وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ ۚ ثُمَّ إِلَىٰ رَبِّكُمْ مَرْجِعُكُمْ فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ فِيهِ تَخْتَلِفُونَ
ఇలా అను: ఏమీ? నేను అల్లాహ్ ను వదలి ఇతరులను ప్రభువులుగా అర్థించాలా? ఆయనే ప్రతి దానికీ ప్రభువు! ప్రతి వ్యక్తీ తాను సంపాదించిందే అనుభవిస్తాడు. మరియు బరువు మోసేవాడు ఎవ్వడూ ఇతరుల బరువును మోయడు. చివరకు మీరంతా మీ ప్రభువు వైపునకే మరలి పోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు ఏ విషయాలను గురించి భేదాభిప్రాయాలు కలిగి ఉండేవారో, వాటిని మీకు తెలియజేస్తాడు
وَهُوَ الَّذِي جَعَلَكُمْ خَلَائِفَ الْأَرْضِ وَرَفَعَ بَعْضَكُمْ فَوْقَ بَعْضٍ دَرَجَاتٍ لِيَبْلُوَكُمْ فِي مَا آتَاكُمْ ۗ إِنَّ رَبَّكَ سَرِيعُ الْعِقَابِ وَإِنَّهُ لَغَفُورٌ رَحِيمٌ
మరియు ఆయనే మిమ్మల్ని భూమి మీద ఉత్తరాధికారులుగా నియమించి - మీకిచ్చిన దానితో మిమ్మల్ని పరీక్షించటానికి - మీలో కొందరికి మరికొందరిపై ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. నిశ్చయంగా, నీ ప్రభువు శిక్ష విధించటంలో అతి శీఘ్రుడు, మరియు నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

Choose other languages: