Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #103 Translated in Telugu

وَهُوَ الَّذِي أَنْزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجْنَا بِهِ نَبَاتَ كُلِّ شَيْءٍ فَأَخْرَجْنَا مِنْهُ خَضِرًا نُخْرِجُ مِنْهُ حَبًّا مُتَرَاكِبًا وَمِنَ النَّخْلِ مِنْ طَلْعِهَا قِنْوَانٌ دَانِيَةٌ وَجَنَّاتٍ مِنْ أَعْنَابٍ وَالزَّيْتُونَ وَالرُّمَّانَ مُشْتَبِهًا وَغَيْرَ مُتَشَابِهٍ ۗ انْظُرُوا إِلَىٰ ثَمَرِهِ إِذَا أَثْمَرَ وَيَنْعِهِ ۚ إِنَّ فِي ذَٰلِكُمْ لَآيَاتٍ لِقَوْمٍ يُؤْمِنُونَ
మరియు ఆయనే ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు తరువాత దాని ద్వారా మేము సర్వలోకాల వృక్షకోటిని ఉద్భవింపజేశాము. మరియు దాని నుండి మేము పచ్చని పైరును పండించాము. వాటిలో దట్టమైన గింజలను పుట్టించాము. మరియు ఖర్జూరపు చెట్ల గెలల నుండి క్రిందికి వ్రేలాడుతున్న పండ్ల గుత్తులను, ద్రాక్ష, జైతూన్ మరియు దానిమ్మ తోటలను (పుట్టించాము). వాటిలో కొన్ని ఒకదాని నొకటి పోలి ఉంటాయి, మరికొన్ని ఒకదాని నొకటి పోలి ఉండవు. ఫలించినప్పుడు వాటి ఫలాలను మరియు వాటి పరిపక్వాన్ని గమనించండి. నిశ్చయంగా, వీటిలో విశ్వసించే వారికి సూచనలున్నాయి
وَجَعَلُوا لِلَّهِ شُرَكَاءَ الْجِنَّ وَخَلَقَهُمْ ۖ وَخَرَقُوا لَهُ بَنِينَ وَبَنَاتٍ بِغَيْرِ عِلْمٍ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يَصِفُونَ
మరియు వారు, ఆయన (అల్లాహ్) సృష్టించిన జిన్నాతులను, అల్లాహ్ కే సాటిగా (భాగస్వాములుగా) కల్పిస్తున్నారు. మూఢత్వంతో ఆయనకు కుమారులు, కుమార్తెలు ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు, వారి ఈ కల్పనలకు మహోన్నతుడు
بَدِيعُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ أَنَّىٰ يَكُونُ لَهُ وَلَدٌ وَلَمْ تَكُنْ لَهُ صَاحِبَةٌ ۖ وَخَلَقَ كُلَّ شَيْءٍ ۖ وَهُوَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఏ నమూనా లేకుండా ఆరంభించిన వాడు. నిశ్చయంగా, ఆయనకు జీవన సహవాసియే (భార్యయే) లేనప్పుడు ఆయనకు కొడుకు ఎలా ఉండగలడు? మరియు ప్రతి దానిని ఆయనే సృష్టించాడు. మరియు ఆయనే ప్రతి విషయం గురించి బాగా తెలిసినవాడు
ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ خَالِقُ كُلِّ شَيْءٍ فَاعْبُدُوهُ ۚ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ وَكِيلٌ
ఆయనే అల్లాహ్ ! మీ ప్రభువు, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనే సర్వానికి సృష్టికర్త, కావున మీరు ఆయననే ఆరాధించండి. మరియు ఆయనే ప్రతి దాని కార్యకర్త
لَا تُدْرِكُهُ الْأَبْصَارُ وَهُوَ يُدْرِكُ الْأَبْصَارَ ۖ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ
ఏ చూపులు కూడా ఆయనను అందుకోలేవు, కాని ఆయన (అన్ని) చూపులను పరివేష్టించి ఉన్నాడు. మరియు ఆయన సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు

Choose other languages: