Quran Apps in many lanuages:

Surah Al-Ahqaf Ayahs #11 Translated in Telugu

وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالَ الَّذِينَ كَفَرُوا لِلْحَقِّ لَمَّا جَاءَهُمْ هَٰذَا سِحْرٌ مُبِينٌ
మరియు వారికి మా స్పష్టమైన సూచనలు (ఆయాత్) వినిపించబడినప్పుడు, సత్యతిరస్కారులు - సత్యం (ఈ ఖుర్ఆన్) వారి ముందుకు వచ్చినప్పుడు - ఇలా అంటారు: ఇది స్పష్టమైన మంత్రజాలమే
أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۖ قُلْ إِنِ افْتَرَيْتُهُ فَلَا تَمْلِكُونَ لِي مِنَ اللَّهِ شَيْئًا ۖ هُوَ أَعْلَمُ بِمَا تُفِيضُونَ فِيهِ ۖ كَفَىٰ بِهِ شَهِيدًا بَيْنِي وَبَيْنَكُمْ ۖ وَهُوَ الْغَفُورُ الرَّحِيمُ
లేదా ఇలా అంటారు: ఇతనే (ముహమ్మదే) దీనిని కల్పించాడు." వారితో ఇలా అను: ఒకవేళ నేను దీనిని కల్పించి ఉండినట్లయితే, మీరు నన్ను అల్లాహ్ (శిక్ష) నుండి ఏ మాత్రం కాపాడలేరు. మీరు కల్పించే మాటలు ఆయనకు బాగా తెలుసు. నాకూ మీకూ మధ్య ఆయన (అల్లాహ్) సాక్ష్యమే చాలు! మరియు ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత
قُلْ مَا كُنْتُ بِدْعًا مِنَ الرُّسُلِ وَمَا أَدْرِي مَا يُفْعَلُ بِي وَلَا بِكُمْ ۖ إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰ إِلَيَّ وَمَا أَنَا إِلَّا نَذِيرٌ مُبِينٌ
(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: నేను మొట్టమొదటి ప్రవక్తనేమీ కాను. నాకూ మరియు మీకూ ఏమి కానున్నదో నాకు తెలియదు. నేను అనుసరించేది, నాపై అవతరింపజేయ బడిన దివ్యజ్ఞానం (వహీ) మాత్రమే. మరియు నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే
قُلْ أَرَأَيْتُمْ إِنْ كَانَ مِنْ عِنْدِ اللَّهِ وَكَفَرْتُمْ بِهِ وَشَهِدَ شَاهِدٌ مِنْ بَنِي إِسْرَائِيلَ عَلَىٰ مِثْلِهِ فَآمَنَ وَاسْتَكْبَرْتُمْ ۖ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
వారిలో ఇలా అను: ఇది (ఈ ఖుర్ఆన్) ఒకవేళ అల్లాహ్ తరఫు నుండి వచ్చి ఉండి, మీరు దీనిని తిరస్కరిస్తూ ఉండినట్లయితే (మీ గతి ఏమవుతుందో) మీరు ఆలోచించరా? ఇస్రాయీల్ సంతతికి చెందిన ఒక సాక్షి ఇది (ఈ ఖుర్ఆన్) దాని (తౌరాత్) లాంటి గ్రంథమేనని, సాక్ష్యం ఇచ్చాడు మరియు విశ్వసించాడు కూడా. కాని మీరేమో అహంభావానికి గురి అయ్యారు. నిశ్చయంగా, అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు
وَقَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا لَوْ كَانَ خَيْرًا مَا سَبَقُونَا إِلَيْهِ ۚ وَإِذْ لَمْ يَهْتَدُوا بِهِ فَسَيَقُولُونَ هَٰذَا إِفْكٌ قَدِيمٌ
సత్యతిరస్కారులు, విశ్వాసులను గురించి ఇలా అంటారు: ఒకవేళ ఇందులో (ఇస్లాంలో) మేలే ఉంటే?, వీరు మా కంటే ముందుగా దాని వైపునకు పోయి ఉండేవారు కాదు!" మరియు వారు దాని (ఖుర్ఆన్) నుండి మార్గదర్శకత్వం పొందలేదు! కాబట్టి వారు: ఇదొక ప్రాచీన బూటక కల్పనయే!" అని అంటారు

Choose other languages: