Quran Apps in many lanuages:

Surah Al-Ahqaf Ayahs #32 Translated in Telugu

فَلَوْلَا نَصَرَهُمُ الَّذِينَ اتَّخَذُوا مِنْ دُونِ اللَّهِ قُرْبَانًا آلِهَةً ۖ بَلْ ضَلُّوا عَنْهُمْ ۚ وَذَٰلِكَ إِفْكُهُمْ وَمَا كَانُوا يَفْتَرُونَ
అల్లాహ్ ను వదలి - తమను ఆయన సాన్నిధ్యానికి తేగలవారని - వారు భావించిన, వారి దేవతలు వారికెందుకు సహాయం చేయవు? అలా కాదు! అవి వారిని త్యజించాయి. ఎందుకంటే అది కేవలం వారి భ్రమ. మరియు వారు కల్పించుకున్న బూటక కల్పన మాత్రమే
وَإِذْ صَرَفْنَا إِلَيْكَ نَفَرًا مِنَ الْجِنِّ يَسْتَمِعُونَ الْقُرْآنَ فَلَمَّا حَضَرُوهُ قَالُوا أَنْصِتُوا ۖ فَلَمَّا قُضِيَ وَلَّوْا إِلَىٰ قَوْمِهِمْ مُنْذِرِينَ
మరియు (ఓ ముహమ్మద్!) జిన్నాతుల ఒక సమూహాన్ని మేము - ఖుర్ఆన్ వినటానికి - నీ వైపునకు మొగ్గునట్లు చేసినపుడు, వారు అక్కడ చేరిన తరువాత పరస్పరం ఇలా మాట్లాడుకున్నారు: నిశ్శబ్దంగా వినండి!" అది (ఆ పఠనం) ముగిసిన తరువాత, వారు హెచ్చరిక చేసేవారిగా, తమ జాతి వైపునకు మరలిపోయారు
قَالُوا يَا قَوْمَنَا إِنَّا سَمِعْنَا كِتَابًا أُنْزِلَ مِنْ بَعْدِ مُوسَىٰ مُصَدِّقًا لِمَا بَيْنَ يَدَيْهِ يَهْدِي إِلَى الْحَقِّ وَإِلَىٰ طَرِيقٍ مُسْتَقِيمٍ
వారు (జిన్నాతులు) ఇలా అన్నారు: ఓ మా జాతివారలారా! వాస్తవంగా మేము మూసా తరువాత అవతరింప జేయబడిన ఒక గ్రంథాన్ని విన్నాము. అది దానికి పూర్వం వచ్చిన దానిని (తౌరాత్ ను) ధృవీకరిస్తుంది; సత్యం వైపునకు మరియు ఋజుమార్గం (ఇస్లాం) వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది
يَا قَوْمَنَا أَجِيبُوا دَاعِيَ اللَّهِ وَآمِنُوا بِهِ يَغْفِرْ لَكُمْ مِنْ ذُنُوبِكُمْ وَيُجِرْكُمْ مِنْ عَذَابٍ أَلِيمٍ
మా జాతి వారలారా! అల్లాహ్ వైపునకు పిలిచేవానిని అనుసరించండి. మరియు ఆయన (అల్లాహ్) ను విశ్వసించండి. ఆయన మీ పాపాలను క్షమిస్తాడు మరియు మిమ్మల్ని బాధాకరమైన శిక్ష నుండి కాపాడుతాడు
وَمَنْ لَا يُجِبْ دَاعِيَ اللَّهِ فَلَيْسَ بِمُعْجِزٍ فِي الْأَرْضِ وَلَيْسَ لَهُ مِنْ دُونِهِ أَوْلِيَاءُ ۚ أُولَٰئِكَ فِي ضَلَالٍ مُبِينٍ
మరియు అల్లాహ్ వైపునకు పిలిచే వానిని అనుసరించని వాడు భూమిలో (అల్లాహ్ నుండి) తప్పించుకోలేడు. మరియు ఆతడికి, ఆయన తప్ప మరొక సంరక్షకుడు లేడు. అలాంటి వారు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లే

Choose other languages: