Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #73 Translated in Telugu

وَدَّتْ طَائِفَةٌ مِنْ أَهْلِ الْكِتَابِ لَوْ يُضِلُّونَكُمْ وَمَا يُضِلُّونَ إِلَّا أَنْفُسَهُمْ وَمَا يَشْعُرُونَ
గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారు, మిమ్మల్ని మార్గభ్రష్టులు చేయాలని కోరుతున్నారు. కాని వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మార్గభ్రష్టులు చేయటం లేదు, కాని వారది గ్రహించటం లేదు
يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَأَنْتُمْ تَشْهَدُونَ
ఓ గ్రంథ ప్రజలారా! మీరు అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) ఎందుకు తిరస్కరిస్తున్నారు? మరియు వాటికి మీరే సాక్షులుగా ఉన్నారు కదా
يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَلْبِسُونَ الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُونَ الْحَقَّ وَأَنْتُمْ تَعْلَمُونَ
ఓ గ్రంథ ప్రజలారా! తెలిసి ఉండి కూడా మీరు సత్యాన్ని అసత్యంతో ఎందుకు కప్పి పుచ్చుతున్నారు? మరియు మీకు తెలిసి ఉండి కూడా సత్యాన్ని ఎందుకు దాస్తున్నారు
وَقَالَتْ طَائِفَةٌ مِنْ أَهْلِ الْكِتَابِ آمِنُوا بِالَّذِي أُنْزِلَ عَلَى الَّذِينَ آمَنُوا وَجْهَ النَّهَارِ وَاكْفُرُوا آخِرَهُ لَعَلَّهُمْ يَرْجِعُونَ
మరియు గ్రంథ ప్రజలలోని కొందరు (పరస్పరం ఇలా చెప్పుకుంటారు): (ఈ ప్రవక్తను) విశ్వసించిన వారిపై (ముస్లింలపై) అవతరింపజేయబడిన దానిని ఉదయం విశ్వసించండి మరియు సాయంత్రం తిరస్కరించండి. (ఇలా చేస్తే) బహుశా, వారు కూడా (తమ విశ్వాసం నుండి) తిరిగి పోతారేమో
وَلَا تُؤْمِنُوا إِلَّا لِمَنْ تَبِعَ دِينَكُمْ قُلْ إِنَّ الْهُدَىٰ هُدَى اللَّهِ أَنْ يُؤْتَىٰ أَحَدٌ مِثْلَ مَا أُوتِيتُمْ أَوْ يُحَاجُّوكُمْ عِنْدَ رَبِّكُمْ ۗ قُلْ إِنَّ الْفَضْلَ بِيَدِ اللَّهِ يُؤْتِيهِ مَنْ يَشَاءُ ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ
మరియు (పరస్పరం ఇలా చెప్పుకుంటారు): మీ ధర్మాన్ని అనుసరించే వారిని తప్ప మరెవ్వరినీ నమ్మకండి." (ఓ ప్రవక్తా!) నీవు వారితో అను: నిశ్చయంగా, అల్లాహ్ మార్గదర్శకత్వమే సరైన మార్గదర్శకత్వం." (వారు ఇంకా ఇలా అంటారు): మీకు ఇవ్వబడినటువంటిది ఇంకెవరికైనా ఇవ్వబడుతుందని, లేక వారు మీ ప్రభువు సమక్షంలో మీతో వాదిస్తారని, (నమ్మకండి)." వారితో అను: నిశ్చయంగా, అనుగ్రహం అల్లాహ్ చేతిలోనే ఉంది; ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు

Choose other languages: