Quran Apps in many lanuages:

Surah Yusuf Ayahs #96 Translated in Telugu

قَالَ لَا تَثْرِيبَ عَلَيْكُمُ الْيَوْمَ ۖ يَغْفِرُ اللَّهُ لَكُمْ ۖ وَهُوَ أَرْحَمُ الرَّاحِمِينَ
(యూసుఫ్) అన్నాడు: ఈరోజు మీపై ఎలాంటి నిందలేదు. అల్లాహ్ మిమ్మల్ని క్షమించుగాక! ఆయన కరుణించే వారిలో అందరి కంటే ఉత్తమమైన కారుణ్యమూర్తి
اذْهَبُوا بِقَمِيصِي هَٰذَا فَأَلْقُوهُ عَلَىٰ وَجْهِ أَبِي يَأْتِ بَصِيرًا وَأْتُونِي بِأَهْلِكُمْ أَجْمَعِينَ
మీరు నా ఈ చొక్కా తీసుకొని పోయి దానిని నా తండ్రి ముఖం మీద వేయండి. అతనికి దృష్టి వస్తుంది. మరియు మీరు మీ కుటుంబం వారినందరినీ నా వద్దకు తీసుకొని రండి
وَلَمَّا فَصَلَتِ الْعِيرُ قَالَ أَبُوهُمْ إِنِّي لَأَجِدُ رِيحَ يُوسُفَ ۖ لَوْلَا أَنْ تُفَنِّدُونِ
ఆ బిడారం (ఈజిప్టు నుండి) బయలు దేరగానే వారి తండ్రి అన్నాడు: మీరు నన్ను బుద్ధి నశించిన ముసలివాడు అన్నా! నిశ్చయంగా నాకు యూసుఫ్ సువాసన వస్తోంది
قَالُوا تَاللَّهِ إِنَّكَ لَفِي ضَلَالِكَ الْقَدِيمِ
(అతని దగ్గర ఉన్నవారు) అన్నారు: అల్లాహ్ తోడు! నిశ్చయంగా నీవు నీ పూర్వపు పొరపాటులోనే పడి ఉన్నావు
فَلَمَّا أَنْ جَاءَ الْبَشِيرُ أَلْقَاهُ عَلَىٰ وَجْهِهِ فَارْتَدَّ بَصِيرًا ۖ قَالَ أَلَمْ أَقُلْ لَكُمْ إِنِّي أَعْلَمُ مِنَ اللَّهِ مَا لَا تَعْلَمُونَ
ఆ తరువాత శుభవార్త తెలిపేవాడు వచ్చి, (యూసుఫ్ చొక్కాను) అతని ముఖం మీద వేయగానే అతని దృష్టి తిరిగి వచ్చేసింది. (అప్పుడు) అతను అన్నాడు: ఏమీ? నేను మీతో అనలేదా? `మీకు తెలియనిది నాకు అల్లాహ్ ద్వారా తెలుస్తుందని

Choose other languages: