Quran Apps in many lanuages:

Surah Yusuf Ayahs #86 Translated in Telugu

وَاسْأَلِ الْقَرْيَةَ الَّتِي كُنَّا فِيهَا وَالْعِيرَ الَّتِي أَقْبَلْنَا فِيهَا ۖ وَإِنَّا لَصَادِقُونَ
మరియు మేము ఉన్న నగరవాసులను మరియు మేము కలిసి తిరిగి వచ్చిన బిడారు వారిని కూడా అడగిండి. మరియు మేము నిశ్చయంగా సత్యం పలుకుతున్నాము
قَالَ بَلْ سَوَّلَتْ لَكُمْ أَنْفُسُكُمْ أَمْرًا ۖ فَصَبْرٌ جَمِيلٌ ۖ عَسَى اللَّهُ أَنْ يَأْتِيَنِي بِهِمْ جَمِيعًا ۚ إِنَّهُ هُوَ الْعَلِيمُ الْحَكِيمُ
(యఅఖూబ్) అన్నాడు: కానీ, మీ (దుష్ట) మనస్సులు మీచేత మరొక ఘోరకార్యాన్ని తేలికగా చేయించాయి. ఇక నా కొరకు సహనమే మేలైనది. ఇక అల్లాహ్ యే! వారందరినీ నా వద్దకు తీసుకు రావచ్చు! నిశ్చయంగా, ఆయనే సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు
وَتَوَلَّىٰ عَنْهُمْ وَقَالَ يَا أَسَفَىٰ عَلَىٰ يُوسُفَ وَابْيَضَّتْ عَيْنَاهُ مِنَ الْحُزْنِ فَهُوَ كَظِيمٌ
మరియు అతను వారి నుండి ముఖం త్రిప్పుకొని అన్నాడు: అయ్యో! యూసుఫ్" అతని కన్నులు, దుఃఖం వలన తెల్లబడ్డాయి (చూపు పోయింది). అయినా అతను దానిని (వెలిబుచ్చకుండా) అణచుకున్నాడు
قَالُوا تَاللَّهِ تَفْتَأُ تَذْكُرُ يُوسُفَ حَتَّىٰ تَكُونَ حَرَضًا أَوْ تَكُونَ مِنَ الْهَالِكِينَ
అతని (కుమారులు) అన్నారు: అల్లాహ్ తోడు! నీవు వ్యాధితో కృశించిపోయే వరకో లేదా నశించిపోయే వరకో యూసుఫ్ ను జ్ఞాపకం చేసుకోవటం మానవు
قَالَ إِنَّمَا أَشْكُو بَثِّي وَحُزْنِي إِلَى اللَّهِ وَأَعْلَمُ مِنَ اللَّهِ مَا لَا تَعْلَمُونَ
(యఅఖూబ్) అన్నాడు: వాస్తవానికి నా ఆవేదనను మరియు నా దుఃఖాన్ని నేను కేవలం అల్లాహ్ తో మాత్రమే మొర పెట్టుకోగలను మరియు మీకు తెలియనిది నాకు అల్లాహ్ ద్వారా తెలుస్తుంది

Choose other languages: