Quran Apps in many lanuages:

Surah Yusuf Ayahs #78 Translated in Telugu

قَالُوا فَمَا جَزَاؤُهُ إِنْ كُنْتُمْ كَاذِبِينَ
(కార్యకర్తలు) అన్నారు: మీరు అబద్ధమాడుతున్నారని తెలిస్తే దానికి శిక్ష ఏమిటి
قَالُوا جَزَاؤُهُ مَنْ وُجِدَ فِي رَحْلِهِ فَهُوَ جَزَاؤُهُ ۚ كَذَٰلِكَ نَجْزِي الظَّالِمِينَ
వారు (యూసుఫ్ సోదరులు) జవాబిచ్చారు: ఎవడి సంచిలో ఆ పాత్ర దొరకుతుందో అతడు దానికి పరిహారంగా (బానిసగా) ఉండాలి. మేము ఇదే విధంగా దుర్మార్గులను శిక్షిస్తాము
فَبَدَأَ بِأَوْعِيَتِهِمْ قَبْلَ وِعَاءِ أَخِيهِ ثُمَّ اسْتَخْرَجَهَا مِنْ وِعَاءِ أَخِيهِ ۚ كَذَٰلِكَ كِدْنَا لِيُوسُفَ ۖ مَا كَانَ لِيَأْخُذَ أَخَاهُ فِي دِينِ الْمَلِكِ إِلَّا أَنْ يَشَاءَ اللَّهُ ۚ نَرْفَعُ دَرَجَاتٍ مَنْ نَشَاءُ ۗ وَفَوْقَ كُلِّ ذِي عِلْمٍ عَلِيمٌ
అప్పుడతడు తన సోదరుని మూట వెదికే ముందు, వారి (సవతి సోదరుల) మూటలను వెతకటం ప్రారంభించాడు. చివరకు తన సోదరుని మూట నుండి దానిని (పాత్రను) బయటికి తీశాడు. ఈ విధంగా మేము యూసుఫ్ కొరకు యుక్తి చూపాము. ఈ విధంగా - అల్లాహ్ ఇచ్ఛయే లేకుంటే - అతను తన సోదరురుణ్ణి, రాజధర్మం ప్రకారం ఉంచుకోలేక పోయేవాడు. మేము కోరిన వారి స్థానాలను పెంచుతాము. మరియు జ్ఞానులందరినీ మించిన జ్ఞాని ఒకడు (అల్లాహ్) ఉన్నాడు
قَالُوا إِنْ يَسْرِقْ فَقَدْ سَرَقَ أَخٌ لَهُ مِنْ قَبْلُ ۚ فَأَسَرَّهَا يُوسُفُ فِي نَفْسِهِ وَلَمْ يُبْدِهَا لَهُمْ ۚ قَالَ أَنْتُمْ شَرٌّ مَكَانًا ۖ وَاللَّهُ أَعْلَمُ بِمَا تَصِفُونَ
(అతని సోదరులన్నారు): ఇతడు దొంగతనం చేసినా (ఆశ్చర్యం లేదు)! వాస్తవానికి ఇతని సోదరుడు కూడా ఇంతకు ముందు దొంగతనం చేశాడు." ఇది విని యూసుఫ్ (కోపాన్ని) తన హృదయంలోనే దాచుకున్నాడు మరియు దానిని వారిపై వ్యక్త పరచలేదు. (తన మనస్సులో) అనుకున్నాడు: మీరు చాలా నీచమైన వారు మరియు మీరు పలికేది అల్లాహ్ కు బాగా తెలుసు
قَالُوا يَا أَيُّهَا الْعَزِيزُ إِنَّ لَهُ أَبًا شَيْخًا كَبِيرًا فَخُذْ أَحَدَنَا مَكَانَهُ ۖ إِنَّا نَرَاكَ مِنَ الْمُحْسِنِينَ
వారన్నారు: ఓ సర్దార్ (అజీజ్) వాస్తవానికి, ఇతని తండ్రి చాలా ముసలివాడు, కావున ఇతనికి బదులుగా నీవు మాలో ఒకనిని ఉంచుకో. వాస్తవానికి, మేము నిన్ను మేలు చేసేవానిగా చూస్తున్నాము

Choose other languages: