Quran Apps in many lanuages:

Surah Yusuf Ayahs #7 Translated in Telugu

نَحْنُ نَقُصُّ عَلَيْكَ أَحْسَنَ الْقَصَصِ بِمَا أَوْحَيْنَا إِلَيْكَ هَٰذَا الْقُرْآنَ وَإِنْ كُنْتَ مِنْ قَبْلِهِ لَمِنَ الْغَافِلِينَ
(ఓ ప్రవక్తా!) మేము ఈ ఖుర్ఆన్ ద్వారా అవతరింపజేసిన కథలలో ఉత్తమమైన గాథను నీకు వినిపించ బోతున్నాము మరియు ఇంతకు ముందు నీవు దీనిని ఎరుగవు
إِذْ قَالَ يُوسُفُ لِأَبِيهِ يَا أَبَتِ إِنِّي رَأَيْتُ أَحَدَ عَشَرَ كَوْكَبًا وَالشَّمْسَ وَالْقَمَرَ رَأَيْتُهُمْ لِي سَاجِدِينَ
(జ్ఞాపకం చేసుకోండి) యూసుఫ్ తన తండ్రితో: ఓ నాన్నా! నేను వాస్తవంగా (కలలో) పదకొండు నక్షత్రాలను, సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి చూశాను; వాటిని నా ముందు సాష్టాంగ పడుతున్నట్లు చూశాను." అని అన్నప్పుడు
قَالَ يَا بُنَيَّ لَا تَقْصُصْ رُؤْيَاكَ عَلَىٰ إِخْوَتِكَ فَيَكِيدُوا لَكَ كَيْدًا ۖ إِنَّ الشَّيْطَانَ لِلْإِنْسَانِ عَدُوٌّ مُبِينٌ
(అతని తండ్రి) అన్నాడు: ఓ నా చిన్న ప్రియకుమారుడా! నీ స్వప్నాన్ని నీ సోదరులకు తెలుపకు. ఎందుకంటే వారు నీకు విరుద్ధంగా కుట్ర పన్నవచ్చు! నిశ్చయంగా, షైతాన్ మానవునికి బహిరంగ శత్రువు
وَكَذَٰلِكَ يَجْتَبِيكَ رَبُّكَ وَيُعَلِّمُكَ مِنْ تَأْوِيلِ الْأَحَادِيثِ وَيُتِمُّ نِعْمَتَهُ عَلَيْكَ وَعَلَىٰ آلِ يَعْقُوبَ كَمَا أَتَمَّهَا عَلَىٰ أَبَوَيْكَ مِنْ قَبْلُ إِبْرَاهِيمَ وَإِسْحَاقَ ۚ إِنَّ رَبَّكَ عَلِيمٌ حَكِيمٌ
మరియు ఆ విధంగానే జరుగుతుంది! నీ ప్రభువు నిన్ను ఎన్నుకుంటాడు మరియు నీకు సంఘటనల (స్వప్నాల) గూడార్థ వివరణ కూడా నేర్పుతాడు మరియు నీ పూర్వీకులైన (తాతముత్తాతలైన), ఇబ్రాహీమ్ మరియు ఇస్ హాఖ్ లకు ప్రసాదించినట్లు నీకూ మరియు యఅఖూబ్ సంతతి వారికి సంపూర్ణంగా తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. నిశ్చయంగా, నీ ప్రభువు సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు
لَقَدْ كَانَ فِي يُوسُفَ وَإِخْوَتِهِ آيَاتٌ لِلسَّائِلِينَ
వాస్తవానికి, యూసుఫ్ మరియు అతని సోదరుల (గాథలో) అడిగే వారికి ఎన్నో సూచనలు ఉన్నాయి

Choose other languages: