Quran Apps in many lanuages:

Surah Yusuf Ayahs #5 Translated in Telugu

الر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ الْمُبِينِ
అలిఫ్ - లామ్ - రా. ఇవి స్పష్టమైన గ్రంథ ఆయతులు
إِنَّا أَنْزَلْنَاهُ قُرْآنًا عَرَبِيًّا لَعَلَّكُمْ تَعْقِلُونَ
వాస్తవంగా, మీరు బాగా అర్థం చేసుకోవాలని, మేము ఈ ఖుర్ఆన్ ను అరబ్బీ భాషలో అవతరింపజేశాము
نَحْنُ نَقُصُّ عَلَيْكَ أَحْسَنَ الْقَصَصِ بِمَا أَوْحَيْنَا إِلَيْكَ هَٰذَا الْقُرْآنَ وَإِنْ كُنْتَ مِنْ قَبْلِهِ لَمِنَ الْغَافِلِينَ
(ఓ ప్రవక్తా!) మేము ఈ ఖుర్ఆన్ ద్వారా అవతరింపజేసిన కథలలో ఉత్తమమైన గాథను నీకు వినిపించ బోతున్నాము మరియు ఇంతకు ముందు నీవు దీనిని ఎరుగవు
إِذْ قَالَ يُوسُفُ لِأَبِيهِ يَا أَبَتِ إِنِّي رَأَيْتُ أَحَدَ عَشَرَ كَوْكَبًا وَالشَّمْسَ وَالْقَمَرَ رَأَيْتُهُمْ لِي سَاجِدِينَ
(జ్ఞాపకం చేసుకోండి) యూసుఫ్ తన తండ్రితో: ఓ నాన్నా! నేను వాస్తవంగా (కలలో) పదకొండు నక్షత్రాలను, సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి చూశాను; వాటిని నా ముందు సాష్టాంగ పడుతున్నట్లు చూశాను." అని అన్నప్పుడు
قَالَ يَا بُنَيَّ لَا تَقْصُصْ رُؤْيَاكَ عَلَىٰ إِخْوَتِكَ فَيَكِيدُوا لَكَ كَيْدًا ۖ إِنَّ الشَّيْطَانَ لِلْإِنْسَانِ عَدُوٌّ مُبِينٌ
(అతని తండ్రి) అన్నాడు: ఓ నా చిన్న ప్రియకుమారుడా! నీ స్వప్నాన్ని నీ సోదరులకు తెలుపకు. ఎందుకంటే వారు నీకు విరుద్ధంగా కుట్ర పన్నవచ్చు! నిశ్చయంగా, షైతాన్ మానవునికి బహిరంగ శత్రువు

Choose other languages: