Quran Apps in many lanuages:

Surah Yunus Ayahs #78 Translated in Telugu

ثُمَّ بَعَثْنَا مِنْ بَعْدِهِ رُسُلًا إِلَىٰ قَوْمِهِمْ فَجَاءُوهُمْ بِالْبَيِّنَاتِ فَمَا كَانُوا لِيُؤْمِنُوا بِمَا كَذَّبُوا بِهِ مِنْ قَبْلُ ۚ كَذَٰلِكَ نَطْبَعُ عَلَىٰ قُلُوبِ الْمُعْتَدِينَ
అతని (నూహ్) తరువాత ప్రవక్తలను వారి వారి జాతులవారి వద్దకు పంపాము. వారు, వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలు తీసుకొని వచ్చినా! వారు మొదట అబద్ధమని తిరస్కరించిన విషయాన్ని మళ్ళీ విశ్వసించ లేక పోయారు. ఈ విధంగా మేము హద్దులు మీరి ప్రవర్తించే వారి హృదయాల మీద ముద్ర వేస్తాము
ثُمَّ بَعَثْنَا مِنْ بَعْدِهِمْ مُوسَىٰ وَهَارُونَ إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ بِآيَاتِنَا فَاسْتَكْبَرُوا وَكَانُوا قَوْمًا مُجْرِمِينَ
ఇక వారి తరువాత, మూసా మరియు హారూన్ లను మా సూచనలతో ఫిర్ఔన్ మరియు అతని నాయకుల వద్దకు పంపితే, వారు దురహంకారం చూపారు. వారు అపరాధులైన జనులు
فَلَمَّا جَاءَهُمُ الْحَقُّ مِنْ عِنْدِنَا قَالُوا إِنَّ هَٰذَا لَسِحْرٌ مُبِينٌ
కావున మా వద్ద నుండి సత్యం వారి ముందుకు వచ్చినపుడు వారు: నిశ్చయంగా, ఇది స్పష్టమైన మంత్రజాలమే! అని అన్నారు
قَالَ مُوسَىٰ أَتَقُولُونَ لِلْحَقِّ لَمَّا جَاءَكُمْ ۖ أَسِحْرٌ هَٰذَا وَلَا يُفْلِحُ السَّاحِرُونَ
మూసా అన్నాడు: ఏమీ? సత్యం మీ ముందుకు వచ్చిన తరువాత కూడా ఇలా అంటారా? ఏమీ? ఇది మంత్రజాలమా? మరియు మాంత్రికులు ఎన్నడూ సాఫల్యం పొందరు కదా
قَالُوا أَجِئْتَنَا لِتَلْفِتَنَا عَمَّا وَجَدْنَا عَلَيْهِ آبَاءَنَا وَتَكُونَ لَكُمَا الْكِبْرِيَاءُ فِي الْأَرْضِ وَمَا نَحْنُ لَكُمَا بِمُؤْمِنِينَ
వారన్నారు: మా తండ్రితాతలు నడిచిన మార్గం నుండి మమ్మల్ని మళ్ళించాలని మరియు మీ ఇద్దరి పెద్దరికాన్ని భూమిలో స్థాపించాలనా, మీరిద్దరూ వచ్చింది? మరియు మేము మీ ఇద్దరినీ ఏ మాత్రం విశ్వసించము

Choose other languages: