Quran Apps in many lanuages:

Surah Ya-Seen Ayahs #62 Translated in Telugu

سَلَامٌ قَوْلًا مِنْ رَبٍّ رَحِيمٍ
మీకు శాంతి కలుగుగాక (సలాం)!" అనే పలుకులు అపార కరుణా ప్రదాత అయిన ప్రభువు తరఫు నుండి వస్తాయి
وَامْتَازُوا الْيَوْمَ أَيُّهَا الْمُجْرِمُونَ
ఇంకా (ఇలా అనబడుతుంది): ఓ అపరాధులారా! ఈనాడు మీరు వేరయి పొండి
أَلَمْ أَعْهَدْ إِلَيْكُمْ يَا بَنِي آدَمَ أَنْ لَا تَعْبُدُوا الشَّيْطَانَ ۖ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُبِينٌ
ఓ ఆదమ్ సంతతివారలారా: `షైతానును ఆరాధించకండి` అని నేను మిమ్మల్ని ఆదేశించలేదా? నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు
وَأَنِ اعْبُدُونِي ۚ هَٰذَا صِرَاطٌ مُسْتَقِيمٌ
మరియు మీరు నన్నే ఆరాధించండి. ఇదే ఋమార్గమనీ
وَلَقَدْ أَضَلَّ مِنْكُمْ جِبِلًّا كَثِيرًا ۖ أَفَلَمْ تَكُونُوا تَعْقِلُونَ
మరియు వాస్తవానికి వాడు (షైతాన్) మీలో పెద్ద సమూహాన్ని దారి తప్పించాడు. ఏమీ? మీకు తెలివి లేక పోయిందా

Choose other languages: