Quran Apps in many lanuages:

Surah Ya-Seen Ayahs #17 Translated in Telugu

وَاضْرِبْ لَهُمْ مَثَلًا أَصْحَابَ الْقَرْيَةِ إِذْ جَاءَهَا الْمُرْسَلُونَ
వారికి సందేశహరులను పంపిన ఆ నగరవాసుల గాథను వినిపించు
إِذْ أَرْسَلْنَا إِلَيْهِمُ اثْنَيْنِ فَكَذَّبُوهُمَا فَعَزَّزْنَا بِثَالِثٍ فَقَالُوا إِنَّا إِلَيْكُمْ مُرْسَلُونَ
మేము వారి వద్దకు ఇద్దరిని పంపగా వారు ఆ ఇద్దరినీ అబద్ధీకులని తిరస్కరించారు. అప్పుడు మేము వారిని మూడవ వానితో బలపరిచాము. అప్పుడు వారు, వారితో: నిశ్చయంగా, మేము (మీ వద్దకు పంపబడిన) సందేశహరులం" అని అన్నారు
قَالُوا مَا أَنْتُمْ إِلَّا بَشَرٌ مِثْلُنَا وَمَا أَنْزَلَ الرَّحْمَٰنُ مِنْ شَيْءٍ إِنْ أَنْتُمْ إِلَّا تَكْذِبُونَ
(దానికి ఆ నగరవాసులు) ఇలా అన్నారు: మీరు కేవలం మా వంటి మానవులే మరియు అనంత కరుణామయుడు మీపై ఏదీ (సందేశాన్నీ) అవతరింపజేయలేదు. మీరు కేవలం అబద్ధాలాడుతున్నారు
قَالُوا رَبُّنَا يَعْلَمُ إِنَّا إِلَيْكُمْ لَمُرْسَلُونَ
(ఆ ప్రవక్తలు) అన్నారు: మా ప్రభువుకు తెలుసు, నిశ్చయంగా మేము మీ వద్దకు పంపబడిన సందేశహరులము
وَمَا عَلَيْنَا إِلَّا الْبَلَاغُ الْمُبِينُ
మా బాధ్యత కేవలం మీకు స్పష్టంగా సందేశాన్ని అందజేయటమే

Choose other languages: