Quran Apps in many lanuages:

Surah Saba Ayahs #37 Translated in Telugu

وَقَالَ الَّذِينَ اسْتُضْعِفُوا لِلَّذِينَ اسْتَكْبَرُوا بَلْ مَكْرُ اللَّيْلِ وَالنَّهَارِ إِذْ تَأْمُرُونَنَا أَنْ نَكْفُرَ بِاللَّهِ وَنَجْعَلَ لَهُ أَنْدَادًا ۚ وَأَسَرُّوا النَّدَامَةَ لَمَّا رَأَوُا الْعَذَابَ وَجَعَلْنَا الْأَغْلَالَ فِي أَعْنَاقِ الَّذِينَ كَفَرُوا ۚ هَلْ يُجْزَوْنَ إِلَّا مَا كَانُوا يَعْمَلُونَ
మరియు బలహీనులైన వారు దురహంకారులైన నాయకులతో ఇలా అంటారు: అలా కాదు! ఇది మీరు రాత్రింబవళ్ళు పన్నిన కుట్ర. మీరు మమ్మల్ని - అల్లాహ్ ను తిరస్కరించి - ఇతరులను ఆయనకు సాటి కల్పించమని ఆజ్ఞాపిస్తూ ఉండేవారు." మరియు వారు శిక్షను చూసినప్పుడు, తమ పశ్చాత్తాపాన్ని దాస్తారు. మరియు మేము సత్యతిరస్కారుల మెడలలో సంకెళ్ళు వేస్తాము. వారు తమ కర్మలకు తగిన ప్రతిఫలం తప్ప మరేదైనా పొందగలరా
وَمَا أَرْسَلْنَا فِي قَرْيَةٍ مِنْ نَذِيرٍ إِلَّا قَالَ مُتْرَفُوهَا إِنَّا بِمَا أُرْسِلْتُمْ بِهِ كَافِرُونَ
మరియు మేము హెచ్చరిక చేసే అతనిని (ప్రవక్తను) ఏ నగరానికి పంపినా, దానిలోని ఐశ్యర్యవంతులు: నిశ్చయంగా, మేము మీ వెంట పంపబడిన సందేశాన్ని తిరస్కరిస్తున్నాము." అని అనకుండా ఉండలేదు
وَقَالُوا نَحْنُ أَكْثَرُ أَمْوَالًا وَأَوْلَادًا وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ
వారు ఇంకా ఇలా అన్నారు: మేము (నీకంటే) ఎక్కువ సంపద మరియు సంతానం కలిగి ఉన్నాము. మరియు మేము ఏ మాత్రం శిక్షింపబడము
قُلْ إِنَّ رَبِّي يَبْسُطُ الرِّزْقَ لِمَنْ يَشَاءُ وَيَقْدِرُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
వారితో అను: నిశ్చయంగా, నా ప్రభువు తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు, మరియు (తాను కోరిన వారికి) మితంగా ఇస్తాడు. కాని చాలా మందికి ఇది తెలియదు
وَمَا أَمْوَالُكُمْ وَلَا أَوْلَادُكُمْ بِالَّتِي تُقَرِّبُكُمْ عِنْدَنَا زُلْفَىٰ إِلَّا مَنْ آمَنَ وَعَمِلَ صَالِحًا فَأُولَٰئِكَ لَهُمْ جَزَاءُ الضِّعْفِ بِمَا عَمِلُوا وَهُمْ فِي الْغُرُفَاتِ آمِنُونَ
మరియు మీ సంపద గానీ మరియు మీ సంతానం గానీ మిమ్మల్ని మా దగ్గరికి తేలేవు; కాని విశ్వసించి సత్కార్యాలు చేసేవారు తప్ప! కావున అలాంటి వారికి తాము చేసిన దానికి రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది. మరియు వారు భవనాలలో సురక్షితంగా ఉంటారు

Choose other languages: