Quran Apps in many lanuages:

Surah Saba Ayahs #22 Translated in Telugu

وَجَعَلْنَا بَيْنَهُمْ وَبَيْنَ الْقُرَى الَّتِي بَارَكْنَا فِيهَا قُرًى ظَاهِرَةً وَقَدَّرْنَا فِيهَا السَّيْرَ ۖ سِيرُوا فِيهَا لَيَالِيَ وَأَيَّامًا آمِنِينَ
మరియు మేము వారి మధ్య మరియు మేము శుభాలు ప్రసాదించిన నగరాల మధ్య, స్పష్టంగా కనిపించే నగరాలను స్థాపించి: వాటి మధ్య సురక్షితంగా రేయింబవళ్ళు ప్రయాణిస్తూ ఉండండి." (అని అన్నాము)
فَقَالُوا رَبَّنَا بَاعِدْ بَيْنَ أَسْفَارِنَا وَظَلَمُوا أَنْفُسَهُمْ فَجَعَلْنَاهُمْ أَحَادِيثَ وَمَزَّقْنَاهُمْ كُلَّ مُمَزَّقٍ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِكُلِّ صَبَّارٍ شَكُورٍ
కాని వారు: ఓ మా ప్రభూ! మా ప్రయాణ దూరాలను పొడిగించు." అని వేడుకొని, తమకు తామే అన్యాయం చేసుకున్నారు. కావున మేము వారిని కథలుగా మిగిల్చి, వారిని పూర్తిగా చెల్లా చెదురు చేశాము. నిశ్చయంగా, ఇందులో సహనశీలుడు, కృతజ్ఞుడు అయిన ప్రతీ వ్యక్తికి సూచనలున్నాయి
وَلَقَدْ صَدَّقَ عَلَيْهِمْ إِبْلِيسُ ظَنَّهُ فَاتَّبَعُوهُ إِلَّا فَرِيقًا مِنَ الْمُؤْمِنِينَ
వాస్తవానికి ఇబ్లీస్ (షైతాన్) వారి విషయంలో తాను ఊహించింది సత్యమయిందని నిరూపించాడు. ఎందుకంటే! విశ్వాసులలోని ఒక వర్గం వారు తప్ప, అందరూ వాడిని అనుసరించారు
وَمَا كَانَ لَهُ عَلَيْهِمْ مِنْ سُلْطَانٍ إِلَّا لِنَعْلَمَ مَنْ يُؤْمِنُ بِالْآخِرَةِ مِمَّنْ هُوَ مِنْهَا فِي شَكٍّ ۗ وَرَبُّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ حَفِيظٌ
మరియు వాడికి (షైతాన్ కు) వారిపై ఎలాంటి అధికారం లేదు. కాని, పరలోకాన్ని విశ్వసించేవాడెవడో (మరియు) దానిని గురించి సంశయంలో పడ్డ వాడెవడో, తెలుసుకోవటానికి మాత్రమే (మేమిలా చేశాము) మరియు నీ ప్రభువు ప్రతి విషయాన్ని కనిపెట్టుకొని ఉంటాడు
قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُمْ مِنْ دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِنْ شِرْكٍ وَمَا لَهُ مِنْهُمْ مِنْ ظَهِيرٍ
వారితో ఇలా అను: అల్లాహ్ ను వదలి మీరు ఎవరినైతే, (ఆరాధ్యదైవాలుగా) భావిస్తున్నారో, వారిని పిలిచి చూడండి!" ఆకాశాలలో గానీ మరియు భూమిలో గానీ రవ్వ (పరమాణువు) అంత వస్తువుపై కూడా వారికి అధికారం లేదు. మరియు వారికి ఆ రెండింటిలో ఎలాంటి భాగస్వామ్యమూ లేదు. మరియు ఆయనకు వారిలో నుండి ఎవ్వడూ సహాయకుడునూ కాడు

Choose other languages: