Quran Apps in many lanuages:

Surah Maryam Ayahs #39 Translated in Telugu

مَا كَانَ لِلَّهِ أَنْ يَتَّخِذَ مِنْ وَلَدٍ ۖ سُبْحَانَهُ ۚ إِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُنْ فَيَكُونُ
ఎవరినైనా కుమారునిగా చేసుకోవటం అల్లాహ్ కు తగినపని కాదు. ఆయన సర్వలోపాలకు అతీతుడు, ఆయన ఏదైనా చేయదలుచు కుంటే, దానిని కేవలం: అయిపో!" అని అంటాడు, అంతే అది అయిపోతుంది
وَإِنَّ اللَّهَ رَبِّي وَرَبُّكُمْ فَاعْبُدُوهُ ۚ هَٰذَا صِرَاطٌ مُسْتَقِيمٌ
(ఈసా అన్నాడు): నిశ్చయంగా అల్లాహ్ యే నా ప్రభువు మరియు మీ ప్రభువు, కావున మీరు ఆయననే ఆరాధించండి. ఇదే ఋజుమార్గము
فَاخْتَلَفَ الْأَحْزَابُ مِنْ بَيْنِهِمْ ۖ فَوَيْلٌ لِلَّذِينَ كَفَرُوا مِنْ مَشْهَدِ يَوْمٍ عَظِيمٍ
తరువాత విభిన్న (క్రైస్తవ) వర్గాల వారు (ఈసాను గురించి) పరస్పర అభిప్రాయభేదాలు నెలకొల్పుకున్నారు. కావున ఈ సత్యతిరస్కారులకు ఆ మహా దినపు దర్శనం వినాశాత్మకంగా ఉంటుంది
أَسْمِعْ بِهِمْ وَأَبْصِرْ يَوْمَ يَأْتُونَنَا ۖ لَٰكِنِ الظَّالِمُونَ الْيَوْمَ فِي ضَلَالٍ مُبِينٍ
వారు మా ముందు హాజరయ్యే రోజున వారి చెవులు బాగానే వింటాయి మరియు వారి కండ్లు బాగానే చూస్తాయి. కాని ఈనాడు ఈ దుర్మార్గులు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు
وَأَنْذِرْهُمْ يَوْمَ الْحَسْرَةِ إِذْ قُضِيَ الْأَمْرُ وَهُمْ فِي غَفْلَةٍ وَهُمْ لَا يُؤْمِنُونَ
మరియు వారిని (రాబోయే) ఆ పశ్చాత్తాప పడవలసిన దినాన్ని గురించి హెచ్చరించు. అప్పుడు పరిణామం నిర్ణయించ బడి ఉంటుంది. (ఇప్పుడైతే) వారు ఏమరుపాటులో పడి ఉన్నారు, కావున వారు విశ్వసించడం లేదు

Choose other languages: