Quran Apps in many lanuages:

Surah Hud Ayahs #17 Translated in Telugu

أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۖ قُلْ فَأْتُوا بِعَشْرِ سُوَرٍ مِثْلِهِ مُفْتَرَيَاتٍ وَادْعُوا مَنِ اسْتَطَعْتُمْ مِنْ دُونِ اللَّهِ إِنْ كُنْتُمْ صَادِقِينَ
లేదా వారు: అతనే (ప్రవక్తయే) దీనిని (ఈ ఖుర్ఆన్ ను) కల్పించాడు." అని అంటున్నారా? వారితో అను: మీరు సత్యవంతులే అయితే - అల్లాహ్ తప్ప, మీరు పిలుచుకోగల వారినందరినీ పిలుచుకొని - దీని వంటి పది సూరాహ్ లను కల్పించి తీసుకురండి
فَإِلَّمْ يَسْتَجِيبُوا لَكُمْ فَاعْلَمُوا أَنَّمَا أُنْزِلَ بِعِلْمِ اللَّهِ وَأَنْ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ فَهَلْ أَنْتُمْ مُسْلِمُونَ
ఒకవేళ (మీరు సాటి కల్పించిన) వారు మీకు సహాయం చేయలేక పోతే (సమాధాన మివ్వకపోతే) నిశ్చయంగా ఇది అల్లాహ్ జ్ఞానంతోనే అవతరింప జేయబడిందని తెలుసుకోండి. మరియు ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. అయితే ఇప్పుడైనా మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అవుతారా
مَنْ كَانَ يُرِيدُ الْحَيَاةَ الدُّنْيَا وَزِينَتَهَا نُوَفِّ إِلَيْهِمْ أَعْمَالَهُمْ فِيهَا وَهُمْ فِيهَا لَا يُبْخَسُونَ
ఎవరు ప్రాపంచిక జీవిత సౌకర్యాలు మరియు దాని అలంకరణ కోరుకుంటారో మేము వారి కర్మల ఫలితాన్ని, ఈ జీవితంలోనే పూర్తిగా చెల్లిస్తాము. మరియు అందులో వారి కెలాంటి లోపం జరుగదు
أُولَٰئِكَ الَّذِينَ لَيْسَ لَهُمْ فِي الْآخِرَةِ إِلَّا النَّارُ ۖ وَحَبِطَ مَا صَنَعُوا فِيهَا وَبَاطِلٌ مَا كَانُوا يَعْمَلُونَ
అలాంటి వారికి పరలోకంలో నరకాగ్ని తప్ప మరేమీ ఉండదు. వారు ఇందులో (ఈ లోకంలో) పాటు పడినదంతా వ్యర్థమయి పోతుంది మరియు వారు చేసిన కర్మలన్నీ విఫలమవుతాయి
أَفَمَنْ كَانَ عَلَىٰ بَيِّنَةٍ مِنْ رَبِّهِ وَيَتْلُوهُ شَاهِدٌ مِنْهُ وَمِنْ قَبْلِهِ كِتَابُ مُوسَىٰ إِمَامًا وَرَحْمَةً ۚ أُولَٰئِكَ يُؤْمِنُونَ بِهِ ۚ وَمَنْ يَكْفُرْ بِهِ مِنَ الْأَحْزَابِ فَالنَّارُ مَوْعِدُهُ ۚ فَلَا تَكُ فِي مِرْيَةٍ مِنْهُ ۚ إِنَّهُ الْحَقُّ مِنْ رَبِّكَ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يُؤْمِنُونَ
ఏ వ్యక్తి అయితే తన ప్రభువు తరఫు నుండి వచ్చిన స్పష్టమైన నిదర్శనం పై ఉన్నాడో! మరియు దానికి తోడుగా ఆయన (అల్లాహ్) సాక్ష్యం ఉందో! మరియు దీనికి ముందు మార్గదర్శిని మరియు కారుణ్యంగా వచ్చిన, మూసా గ్రంథం కూడా సాక్షిగా ఉందో! (అలాంటి వాడు సత్యతిరస్కారులతో సమానుడా?) అలాంటి వారు దీనిని (ఖుర్ఆన్ ను) విశ్వసిస్తారు. మరియు దీనిని (ఖుర్ఆన్ ను) తిరస్కరించే తెగల వారి వాగ్దాన స్థలం నరకాగ్నియే! కావున దీనిని గురించి నీవు ఎలాంటి సందేహంలో పడకు. నిశ్చయంగా, ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. కాని చాలా మంది ప్రజలు విశ్వసించరు

Choose other languages: