Quran Apps in many lanuages:

Surah Ghafir Ayahs #76 Translated in Telugu

فِي الْحَمِيمِ ثُمَّ فِي النَّارِ يُسْجَرُونَ
సలసలకాగే నీళ్ళలోకి; తరువాత నరకాగ్నిలోకి కాల్చబడటానికి
ثُمَّ قِيلَ لَهُمْ أَيْنَ مَا كُنْتُمْ تُشْرِكُونَ
అప్పుడు వారితో అనబడుతుంది: మీరు సాటి కల్పించే (భాగస్వాములు) ఇప్పుడు ఎక్కడున్నారు
مِنْ دُونِ اللَّهِ ۖ قَالُوا ضَلُّوا عَنَّا بَلْ لَمْ نَكُنْ نَدْعُو مِنْ قَبْلُ شَيْئًا ۚ كَذَٰلِكَ يُضِلُّ اللَّهُ الْكَافِرِينَ
(ఎవరినైతే) మీరు అల్లాహ్ ను వదలి (ప్రార్థిస్తూ ఉన్నారో)!" వారంటారు: వారు మమ్మల్ని త్యజించారు! అలా కాదు దీనికి పూర్వం మేము ఎవరినీ ప్రార్థించేవారమే కాదు." ఈ విధంగా అల్లాహ్ సత్యతిరస్కారులను మార్గభ్రష్టత్వంలో వదలుతాడు
ذَٰلِكُمْ بِمَا كُنْتُمْ تَفْرَحُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَبِمَا كُنْتُمْ تَمْرَحُونَ
(వారితో ఇలా అనబడుతుంది): ఇదంతా మీరు అన్యాయంగా, భూమిలో విర్రవీగుతూ ఉన్నందుకు మరియు దురభిమానంతో ప్రవర్తించినందుకూ
ادْخُلُوا أَبْوَابَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۖ فَبِئْسَ مَثْوَى الْمُتَكَبِّرِينَ
(కావున ఇప్పుడు) నరక ద్వారాలలో ప్రవేశించండి, అందులో శాశ్వతంగా ఉండటానికి. దురహంకారంతో ప్రవర్తించిన వారి నివాస స్థలం ఎంత దుర్భరమైనది

Choose other languages: