Quran Apps in many lanuages:

Surah Ghafir Ayahs #50 Translated in Telugu

النَّارُ يُعْرَضُونَ عَلَيْهَا غُدُوًّا وَعَشِيًّا ۖ وَيَوْمَ تَقُومُ السَّاعَةُ أَدْخِلُوا آلَ فِرْعَوْنَ أَشَدَّ الْعَذَابِ
ఆ నరకాగ్ని! వారు దాని యెదుటకు ఉదయమూ మరియు సాయంత్రమూ రప్పింపబడుతూ ఉంటారు. మరియు (పునరుత్థాన) దినపు ఘడియ వచ్చినపుడు: ఫిర్ఔన్ జనులను తీవ్రమైన శిక్షలో పడవేయండి!" అని ఆజ్ఞ ఇవ్వబడుతుంది
وَإِذْ يَتَحَاجُّونَ فِي النَّارِ فَيَقُولُ الضُّعَفَاءُ لِلَّذِينَ اسْتَكْبَرُوا إِنَّا كُنَّا لَكُمْ تَبَعًا فَهَلْ أَنْتُمْ مُغْنُونَ عَنَّا نَصِيبًا مِنَ النَّارِ
ఇక వారు నరకాగ్నిలో పరస్పరం వాదులాడుతున్నప్పుడు, (ఇహలోకంలో) బలహీనులుగా పరిగణింపబడిన వారు, పెద్ద మనుషులుగా (నాయకులుగా) పరిగణింపబడే వారితో ఇలా అంటారు: వాస్తవానికి, మేము మిమ్మల్ని అనుసరిస్తూ ఉండే వారము, కావున మీరిప్పుడు మా నుండి నరకాగ్నిని కొంతనైనా తొలగించగలరా
قَالَ الَّذِينَ اسْتَكْبَرُوا إِنَّا كُلٌّ فِيهَا إِنَّ اللَّهَ قَدْ حَكَمَ بَيْنَ الْعِبَادِ
దుహంకారంలో మునిగి ఉన్నవారు (ఆ పెద్ద మనుషులు) ఇలా అంటారు: వాస్తవానికి, మనమందరం అందులో (నరకాగ్నిలో) ఉన్నాం. నిశ్చయంగా, అల్లాహ్ తన దాసుల మధ్య వాస్తవమైన తీర్పు చేశాడు
وَقَالَ الَّذِينَ فِي النَّارِ لِخَزَنَةِ جَهَنَّمَ ادْعُوا رَبَّكُمْ يُخَفِّفْ عَنَّا يَوْمًا مِنَ الْعَذَابِ
మరియు నరకాగ్నిలో పడివున్న వారు, నరకపు రక్షకులతో: మా శిక్షను కనీసం ఒక్కరోజు కొరకైనా తగ్గించమని, మీరు మీ ప్రభువును ప్రార్థించండి!" అని అంటారు
قَالُوا أَوَلَمْ تَكُ تَأْتِيكُمْ رُسُلُكُمْ بِالْبَيِّنَاتِ ۖ قَالُوا بَلَىٰ ۚ قَالُوا فَادْعُوا ۗ وَمَا دُعَاءُ الْكَافِرِينَ إِلَّا فِي ضَلَالٍ
వారు (రక్షకులు) అంటారు: ఏమీ? మీ వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని మీ దైవప్రవక్తలు రాలేదా?" అప్పుడు వారంటారు: అవును (వచ్చారు)!" వారికి ఇలా జవాబివ్వబడుతుంది: అయితే మీరే ప్రార్థించండి!" కాని సత్యతిరస్కారుల ప్రార్థన నిష్ఫలమే అవుతుంది

Choose other languages: