Quran Apps in many lanuages:

Surah Ghafir Ayahs #25 Translated in Telugu

أَوَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنْظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ كَانُوا مِنْ قَبْلِهِمْ ۚ كَانُوا هُمْ أَشَدَّ مِنْهُمْ قُوَّةً وَآثَارًا فِي الْأَرْضِ فَأَخَذَهُمُ اللَّهُ بِذُنُوبِهِمْ وَمَا كَانَ لَهُمْ مِنَ اللَّهِ مِنْ وَاقٍ
ఏమీ? వారు భూమిలో సంచారం చేసి తమకు ముందు గతించిన వారి ముగింపు ఎలా జరిగిందో చూడలేదా? వారు, వీరి కంటే ఎక్కువ బలం గలవారు. మరియు వీరి కంటే ఎక్కువ గుర్తులను భూమిలో వదిలి పోయారు; కాని అల్లాహ్ వారి పాపాలకుగానూ వారిని పట్టుకున్నాడు మరియు అప్పుడు వారిని అల్లాహ్ పట్టు నుండి కాపాడేవాడు ఎవ్వడూ లేక పోయాడు
ذَٰلِكَ بِأَنَّهُمْ كَانَتْ تَأْتِيهِمْ رُسُلُهُمْ بِالْبَيِّنَاتِ فَكَفَرُوا فَأَخَذَهُمُ اللَّهُ ۚ إِنَّهُ قَوِيٌّ شَدِيدُ الْعِقَابِ
ఇలా ఎందుకు జరిగిందంటే! వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు! కాని వారు, వారిని తిరస్కరించారు, కాబట్టి అల్లాహ్ వారిని శిక్షకు గురి చేశాడు. నిశ్చయంగా, ఆయన మహా బలశాలి, శిక్ష విధించటంలో కఠినుడు
وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِآيَاتِنَا وَسُلْطَانٍ مُبِينٍ
మరియు వాస్తవంగా, మేము మూసాను మా సూచనలతో (ఆయాత్ లతో) మరియు స్పష్టమైన అధికారంతో పంపి ఉన్నాము
إِلَىٰ فِرْعَوْنَ وَهَامَانَ وَقَارُونَ فَقَالُوا سَاحِرٌ كَذَّابٌ
ఫిర్ఔన్, హామాన్ మరియు ఖారూన్ ల వద్దకు! కాని వారు: ఇతను మాంత్రికుడు, అసత్యవాది!" అని అన్నారు
فَلَمَّا جَاءَهُمْ بِالْحَقِّ مِنْ عِنْدِنَا قَالُوا اقْتُلُوا أَبْنَاءَ الَّذِينَ آمَنُوا مَعَهُ وَاسْتَحْيُوا نِسَاءَهُمْ ۚ وَمَا كَيْدُ الْكَافِرِينَ إِلَّا فِي ضَلَالٍ
తరువాత అతను మా వద్ద నుండి సత్యాన్ని వారి ముందుకు తీసుకొని రాగా వారన్నారు: ఇతనిని విశ్వసించే వారందరి పుత్రులను చంపండి మరియు వారి స్త్రీలను బ్రతకనివ్వండి." కాని సత్యతిరస్కారుల పన్నాగాలు వ్యర్థమే అవుతాయి

Choose other languages: