Quran Apps in many lanuages:

Surah Fussilat Ayahs #51 Translated in Telugu

إِلَيْهِ يُرَدُّ عِلْمُ السَّاعَةِ ۚ وَمَا تَخْرُجُ مِنْ ثَمَرَاتٍ مِنْ أَكْمَامِهَا وَمَا تَحْمِلُ مِنْ أُنْثَىٰ وَلَا تَضَعُ إِلَّا بِعِلْمِهِ ۚ وَيَوْمَ يُنَادِيهِمْ أَيْنَ شُرَكَائِي قَالُوا آذَنَّاكَ مَا مِنَّا مِنْ شَهِيدٍ
ఆ (అంతిమ) ఘడియ జ్ఞానం కేవలం ఆయనకే చెందినది. మరియు ఆయనకు తెలియకుండా ఫలాలు పుష్పకోశాల నుండి బయటికి రావు మరియు ఆయనకు తెలియకుండా ఏ స్త్రీ కూడా గర్భం దాల్చదు మరియు ప్రసవించదు. మరియు ఏ దినమునైతే వారిని పిలిచి: మీరు నాకు సాటి కల్పించే ఆ భాగస్వాములు ఎక్కడున్నారు?" అని అడిగితే,వారు ఇలా జవాబిస్తారు: మాలో ఎవ్వడు కూడా దీనికి సాక్ష్యం ఇచ్చేవాడు లేడని మేము ఇది వరకే మనవి చేసుకున్నాము
وَضَلَّ عَنْهُمْ مَا كَانُوا يَدْعُونَ مِنْ قَبْلُ ۖ وَظَنُّوا مَا لَهُمْ مِنْ مَحِيصٍ
మరియు వారు ఇంతకు పూర్వం ఆరాధించే వారంతా వారిని త్యజించి ఉంటారు. మరియు తమకు తప్పించుకునే మార్గం లేదని వారు గ్రహిస్తారు
لَا يَسْأَمُ الْإِنْسَانُ مِنْ دُعَاءِ الْخَيْرِ وَإِنْ مَسَّهُ الشَّرُّ فَيَئُوسٌ قَنُوطٌ
మానవుడు మేలు కొరకు ప్రార్థిస్తూ ఎన్నడూ అలసిపోడు. కాని ఒకవేళ అతనికి ఏదైనా ఆపద కలిగితే, అతడు ఆశ వదలి నిరాశ చెందుతాడు
وَلَئِنْ أَذَقْنَاهُ رَحْمَةً مِنَّا مِنْ بَعْدِ ضَرَّاءَ مَسَّتْهُ لَيَقُولَنَّ هَٰذَا لِي وَمَا أَظُنُّ السَّاعَةَ قَائِمَةً وَلَئِنْ رُجِعْتُ إِلَىٰ رَبِّي إِنَّ لِي عِنْدَهُ لَلْحُسْنَىٰ ۚ فَلَنُنَبِّئَنَّ الَّذِينَ كَفَرُوا بِمَا عَمِلُوا وَلَنُذِيقَنَّهُمْ مِنْ عَذَابٍ غَلِيظٍ
మరియు ఒకవేళ మేము అతనికి ఆపద కాలం దాటి పోయిన తర్వాత మా కారుణ్యాన్ని రుచి చూపిస్తే అతడు తప్పకుండా ఇలా అంటాడు: ఇది నా హక్కే! మరియు పునరుత్థాన దినం వస్తుందని నేను భావించను. మరియు ఒకవేళ నేను నా ప్రభువు వద్దకు మరలింపబడినా! నిశ్చయంగా, నాకు ఆయన దగ్గర మేలే ఉంటుంది." కాని మేము సత్యతిరస్కారులకు వారు చేసిన కర్మలను గురించి వారికి తప్పక తెలుపుతాము మరియు వారికి భయంకరమైన శిక్షను రుచి చూపిస్తాము
وَإِذَا أَنْعَمْنَا عَلَى الْإِنْسَانِ أَعْرَضَ وَنَأَىٰ بِجَانِبِهِ وَإِذَا مَسَّهُ الشَّرُّ فَذُو دُعَاءٍ عَرِيضٍ
మరియు ఒకవేళ మేము మానవుణ్ణి అనుగ్రహిస్తే, అతడు మా నుండి విముఖుడై ప్రక్కకు మరలిపోతాడు. మరియు ఒకవేళ తనకు ఆపద వస్తే సుదీర్ఘమైన ప్రార్థనలు చేస్తాడు

Choose other languages: