Quran Apps in many lanuages:

Surah Fussilat Ayahs #36 Translated in Telugu

نُزُلًا مِنْ غَفُورٍ رَحِيمٍ
ఇదంతా క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత ప్రసాదించిన ఆతిథ్యము
وَمَنْ أَحْسَنُ قَوْلًا مِمَّنْ دَعَا إِلَى اللَّهِ وَعَمِلَ صَالِحًا وَقَالَ إِنَّنِي مِنَ الْمُسْلِمِينَ
మరియు (ప్రజలను) అల్లాహ్ వైపునకు పిలుస్తూ, సత్కార్యాలు చేస్తూ: నేను అల్లాహ్ కే విధేయుడను (ముస్లింను)!" అని పలికేవాని మాటకంటే మంచి మాట మరెవరిది
وَلَا تَسْتَوِي الْحَسَنَةُ وَلَا السَّيِّئَةُ ۚ ادْفَعْ بِالَّتِي هِيَ أَحْسَنُ فَإِذَا الَّذِي بَيْنَكَ وَبَيْنَهُ عَدَاوَةٌ كَأَنَّهُ وَلِيٌّ حَمِيمٌ
మరియు మంచీ మరియు చెడులు సరిసమానం కాజాలవు. (చెడును) మంచితో తొలగించు; అప్పుడు నీతో విరోధమున్న వాడూ కూడా తప్పక నీ ప్రాణ స్నేహితుడవుతాడు
وَمَا يُلَقَّاهَا إِلَّا الَّذِينَ صَبَرُوا وَمَا يُلَقَّاهَا إِلَّا ذُو حَظٍّ عَظِيمٍ
మరియు ఇది కేవలం సహనశీలురకు తప్ప ఇతరులకు లభించదు. మరియు ఇది గొప్ప అదృష్టవంతులకు తప్ప ఇతరులకు లభించదు
وَإِمَّا يَنْزَغَنَّكَ مِنَ الشَّيْطَانِ نَزْغٌ فَاسْتَعِذْ بِاللَّهِ ۖ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
మరియు ఒకవేళ షైతాన్ నుండి నీకు ఏదైనా కలత కలిగినపుడు, నీవు అల్లాహ్ శరణు వేడుకో. నిశ్చయంగా ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు

Choose other languages: