Quran Apps in many lanuages:

Surah Fussilat Ayahs #34 Translated in Telugu

إِنَّ الَّذِينَ قَالُوا رَبُّنَا اللَّهُ ثُمَّ اسْتَقَامُوا تَتَنَزَّلُ عَلَيْهِمُ الْمَلَائِكَةُ أَلَّا تَخَافُوا وَلَا تَحْزَنُوا وَأَبْشِرُوا بِالْجَنَّةِ الَّتِي كُنْتُمْ تُوعَدُونَ
నిశ్చయంగా, ఎవరైతే: అల్లాహ్ యే మా ప్రభువు!" అని పలుకుతూ తరువాత దాని పైననే స్థిరంగా ఉంటారో! వారిపై దేవదూతలు దిగి వచ్చి (ఇలా అంటారు): మీరు భయ పడకండి మరియు దుఃఖపడకండి, మీకు వాగ్దానం చేయబడిన స్వర్గపు శుభవార్తను వినండి
نَحْنُ أَوْلِيَاؤُكُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ ۖ وَلَكُمْ فِيهَا مَا تَشْتَهِي أَنْفُسُكُمْ وَلَكُمْ فِيهَا مَا تَدَّعُونَ
మేము ఇహలోక జీవితంలో మరియు పరలోక జీవితంలో కూడా మీకు సన్నిహితులముగా ఉన్నాము. మరియు మీ కొరకు అందులో మీ మనస్సులు కోరిందంతా ఉంటుంది. మరియు మీరు ఆశించేదంతా దొరుకుతుంది
نُزُلًا مِنْ غَفُورٍ رَحِيمٍ
ఇదంతా క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత ప్రసాదించిన ఆతిథ్యము
وَمَنْ أَحْسَنُ قَوْلًا مِمَّنْ دَعَا إِلَى اللَّهِ وَعَمِلَ صَالِحًا وَقَالَ إِنَّنِي مِنَ الْمُسْلِمِينَ
మరియు (ప్రజలను) అల్లాహ్ వైపునకు పిలుస్తూ, సత్కార్యాలు చేస్తూ: నేను అల్లాహ్ కే విధేయుడను (ముస్లింను)!" అని పలికేవాని మాటకంటే మంచి మాట మరెవరిది
وَلَا تَسْتَوِي الْحَسَنَةُ وَلَا السَّيِّئَةُ ۚ ادْفَعْ بِالَّتِي هِيَ أَحْسَنُ فَإِذَا الَّذِي بَيْنَكَ وَبَيْنَهُ عَدَاوَةٌ كَأَنَّهُ وَلِيٌّ حَمِيمٌ
మరియు మంచీ మరియు చెడులు సరిసమానం కాజాలవు. (చెడును) మంచితో తొలగించు; అప్పుడు నీతో విరోధమున్న వాడూ కూడా తప్పక నీ ప్రాణ స్నేహితుడవుతాడు

Choose other languages: