Quran Apps in many lanuages:

Surah Fussilat Ayahs #32 Translated in Telugu

ذَٰلِكَ جَزَاءُ أَعْدَاءِ اللَّهِ النَّارُ ۖ لَهُمْ فِيهَا دَارُ الْخُلْدِ ۖ جَزَاءً بِمَا كَانُوا بِآيَاتِنَا يَجْحَدُونَ
అల్లాహ్ విరోధులకు దొరికే ప్రతిఫలం ఇదే - నరకాగ్ని - అందు వారి శాశ్వత గృహం ఉంటుంది. ఇది మా సూచన (ఆయాత్) లను తిరస్కరిస్తూ వున్న దాని ప్రతిఫలం
وَقَالَ الَّذِينَ كَفَرُوا رَبَّنَا أَرِنَا اللَّذَيْنِ أَضَلَّانَا مِنَ الْجِنِّ وَالْإِنْسِ نَجْعَلْهُمَا تَحْتَ أَقْدَامِنَا لِيَكُونَا مِنَ الْأَسْفَلِينَ
అప్పుడా సత్యతిరస్కారులు ఇలా అంటారు: ఓ మా ప్రభూ! మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసిన ఆ జిన్నాతులను మరియు మానవులను మాకు చూపించు; వారు మరింత పరాభవం పొందటానికి మేము వారిని మా పాదాల క్రింద పడవేసి త్రొక్కుతాము
إِنَّ الَّذِينَ قَالُوا رَبُّنَا اللَّهُ ثُمَّ اسْتَقَامُوا تَتَنَزَّلُ عَلَيْهِمُ الْمَلَائِكَةُ أَلَّا تَخَافُوا وَلَا تَحْزَنُوا وَأَبْشِرُوا بِالْجَنَّةِ الَّتِي كُنْتُمْ تُوعَدُونَ
నిశ్చయంగా, ఎవరైతే: అల్లాహ్ యే మా ప్రభువు!" అని పలుకుతూ తరువాత దాని పైననే స్థిరంగా ఉంటారో! వారిపై దేవదూతలు దిగి వచ్చి (ఇలా అంటారు): మీరు భయ పడకండి మరియు దుఃఖపడకండి, మీకు వాగ్దానం చేయబడిన స్వర్గపు శుభవార్తను వినండి
نَحْنُ أَوْلِيَاؤُكُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ ۖ وَلَكُمْ فِيهَا مَا تَشْتَهِي أَنْفُسُكُمْ وَلَكُمْ فِيهَا مَا تَدَّعُونَ
మేము ఇహలోక జీవితంలో మరియు పరలోక జీవితంలో కూడా మీకు సన్నిహితులముగా ఉన్నాము. మరియు మీ కొరకు అందులో మీ మనస్సులు కోరిందంతా ఉంటుంది. మరియు మీరు ఆశించేదంతా దొరుకుతుంది
نُزُلًا مِنْ غَفُورٍ رَحِيمٍ
ఇదంతా క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత ప్రసాదించిన ఆతిథ్యము

Choose other languages: