Quran Apps in many lanuages:

Surah Fussilat Ayahs #22 Translated in Telugu

وَنَجَّيْنَا الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ
మరియు మేము వారిలో విశ్వాసులైన వారిని మరియు దైవభీతి గల వారిని రక్షించాము
وَيَوْمَ يُحْشَرُ أَعْدَاءُ اللَّهِ إِلَى النَّارِ فَهُمْ يُوزَعُونَ
మరియు (జ్ఞాపకముంచుకోండి) అల్లాహ్ యొక్క విరోధులు నరకాగ్ని వైపుకు సమీకరించబడే రోజు, వారు తమ తమ స్థానాలకు పంపబడతారు
حَتَّىٰ إِذَا مَا جَاءُوهَا شَهِدَ عَلَيْهِمْ سَمْعُهُمْ وَأَبْصَارُهُمْ وَجُلُودُهُمْ بِمَا كَانُوا يَعْمَلُونَ
చివరకు వారు దానిని (నరకాగ్నిని) చేరుకున్నప్పుడు; వారి చెవులు, వారి కళ్ళు మరియు వారి చర్మాలు వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి, వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి
وَقَالُوا لِجُلُودِهِمْ لِمَ شَهِدْتُمْ عَلَيْنَا ۖ قَالُوا أَنْطَقَنَا اللَّهُ الَّذِي أَنْطَقَ كُلَّ شَيْءٍ وَهُوَ خَلَقَكُمْ أَوَّلَ مَرَّةٍ وَإِلَيْهِ تُرْجَعُونَ
మరియు వారు తమ చర్మాలను (అవయవాలను) అడుగుతారు: మీరెందుకు మాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నారు?" అవి ఇలా సమాధానమిస్తాయి: ప్రతి వస్తువుకు మాట్లాడే శక్తి ప్రసాదించిన అల్లాహ్ యే మమ్మల్ని మాట్లాడింప జేశాడు." మరియు ఆయనే మిమ్మల్ని మొదటిసారి సృష్టించిన వాడు, మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు
وَمَا كُنْتُمْ تَسْتَتِرُونَ أَنْ يَشْهَدَ عَلَيْكُمْ سَمْعُكُمْ وَلَا أَبْصَارُكُمْ وَلَا جُلُودُكُمْ وَلَٰكِنْ ظَنَنْتُمْ أَنَّ اللَّهَ لَا يَعْلَمُ كَثِيرًا مِمَّا تَعْمَلُونَ
మరియు (మీరు దుష్కార్యాలు చేసేటప్పుడు) మీ చెవుల నుండి మీ కండ్ల నుండి మరియు మీ చర్మాల నుండి - మీకు వ్యతిరేకంగా సాక్ష్యం వస్తుందేమోనని - మిమ్మల్ని మీరు దాచుకునేవారు కాదు. అంతేకాదు మీరు చేస్తున్న ఎన్నో కార్యాలు వాస్తవంగా, అల్లాహ్ కు తెలియటం లేదని మీరు భావించేవారు

Choose other languages: