Quran Apps in many lanuages:

Surah Fatir Ayahs #16 Translated in Telugu

وَمَا يَسْتَوِي الْبَحْرَانِ هَٰذَا عَذْبٌ فُرَاتٌ سَائِغٌ شَرَابُهُ وَهَٰذَا مِلْحٌ أُجَاجٌ ۖ وَمِنْ كُلٍّ تَأْكُلُونَ لَحْمًا طَرِيًّا وَتَسْتَخْرِجُونَ حِلْيَةً تَلْبَسُونَهَا ۖ وَتَرَى الْفُلْكَ فِيهِ مَوَاخِرَ لِتَبْتَغُوا مِنْ فَضْلِهِ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ
రెండు సముద్రాలు సరిసమానం కాజాలవు. వాటిలోని ఒకదాని (నీరు) రుచికరమైనది, దాహం తీర్చేది మరియు త్రాగటానికి మధురమైనది. రెండోదాని (నీరు) ఉప్పుగానూ, చేదుగానూ ఉన్నది. అయినా వాటిలో ప్రతి ఒక్క దాని నుండి మీరు తాజా మాంసం తింటున్నారు మరియు ఆభరణాలు తీసి ధరిస్తున్నారు. మరియు నీవు చూస్తున్నావు, ఓడలు వాటిని చీల్చుతూ పోవటాన్ని; (వాటిలో) మీరు, ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి మరియు మీరు ఆయనకు కృతజ్ఞులై ఉండటానికి
يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ كُلٌّ يَجْرِي لِأَجَلٍ مُسَمًّى ۚ ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ ۚ وَالَّذِينَ تَدْعُونَ مِنْ دُونِهِ مَا يَمْلِكُونَ مِنْ قِطْمِيرٍ
ఆయనే రాత్రిని పగటిలోకి ప్రవేశింప జేస్తున్నాడు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింప జేస్తున్నాడు మరియు సూర్యచంద్రులను నియమబద్ధులుగా చేసి ఉన్నాడు. అవి తమ తమ పరిధిలో, నిర్ణీత వ్యవధిలో తిరుగుతూ ఉన్నాయి. ఆయనే అల్లాహ్! మీ ప్రభువు, విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే! మరియు ఆయనను వదలి మీరు వేడుకునే వారు, ఖర్జూర బీజంపై నున్న పొరకు కూడా యజమానులు కారు
إِنْ تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ ۚ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍ
మీరు వారిని వేడుకొన్నప్పటికీ, వారు మీ ప్రార్థనలను వినలేరు, ఒకవేళ విన్నా, వారు మీకు జవాబివ్వలేరు. మరియు పునరుత్థాన దినమున మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు తిరస్కరిస్తారు. మరియు (సత్యాన్ని) గురించి నీకు ఆ సర్వం తెలిసినవాడు తెలిపినట్లు మరెవ్వరూ తెలుపజాలరు
يَا أَيُّهَا النَّاسُ أَنْتُمُ الْفُقَرَاءُ إِلَى اللَّهِ ۖ وَاللَّهُ هُوَ الْغَنِيُّ الْحَمِيدُ
ఓ మానవులారా! అల్లాహ్ అక్కర గలవారు మీరే! వాస్తవానికి అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు
إِنْ يَشَأْ يُذْهِبْكُمْ وَيَأْتِ بِخَلْقٍ جَدِيدٍ
ఆయన కోరితే మిమ్మల్ని నాశనం చేసి (మీ స్థానంలో) క్రొత్త సృష్టిని తేగలడు

Choose other languages: