Quran Apps in many lanuages:

Surah Az-Zukhruf Ayahs #42 Translated in Telugu

حَتَّىٰ إِذَا جَاءَنَا قَالَ يَا لَيْتَ بَيْنِي وَبَيْنَكَ بُعْدَ الْمَشْرِقَيْنِ فَبِئْسَ الْقَرِينُ
చివరకు అతడు మా వద్దకు వచ్చినపుడు (తన వెంట ఉన్న షైతాన్ తో) ఇలా అంటాడు: అయ్యో! నా దౌర్భాగ్యం! నీకూ నాకూ మధ్య తూర్పుపడమరల మధ్య ఉన్నంత దూరం ఉండి వుంటే ఎంత బాగుండేది! ఎందుకంటే నీవు అతి చెడ్డ సహచరుడివి
وَلَنْ يَنْفَعَكُمُ الْيَوْمَ إِذْ ظَلَمْتُمْ أَنَّكُمْ فِي الْعَذَابِ مُشْتَرِكُونَ
మరియు మీరు దుర్మార్గం చేశారు! కావున, ఈరోజు మీరంతా ఈ శిక్షలో కలిసి ఉండటం మీకు ఏ మాత్రం లాభదాయకం కాదు
أَفَأَنْتَ تُسْمِعُ الصُّمَّ أَوْ تَهْدِي الْعُمْيَ وَمَنْ كَانَ فِي ضَلَالٍ مُبِينٍ
(ఓ ముహమ్మద్!) నీవు చెవిటి వాడికి వినిపింప జేయగలవా? లేదా గ్రుడ్డివాడికి మార్గం చూపించ గలవా? లేక, స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో ఉన్నవాడికి (మార్గదర్శకత్వం చేయగలవా)
فَإِمَّا نَذْهَبَنَّ بِكَ فَإِنَّا مِنْهُمْ مُنْتَقِمُونَ
ఒకవేళ వాస్తవానికి, మేము నిన్ను తీసుకొని పోయినా, వారికి మాత్రం తప్పకుండా ప్రతీకారం చేస్తాము
أَوْ نُرِيَنَّكَ الَّذِي وَعَدْنَاهُمْ فَإِنَّا عَلَيْهِمْ مُقْتَدِرُونَ
లేదా మేము వారికి వాగ్దానం చేసిన దానిని (శిక్షను) నీకు తప్పక చూపగలము. ఎందుకంటే మాకు వారిపై పూర్తి అధికారముంది

Choose other languages: