Quran Apps in many lanuages:

Surah Az-Zamar Ayahs #70 Translated in Telugu

بَلِ اللَّهَ فَاعْبُدْ وَكُنْ مِنَ الشَّاكِرِينَ
అలా కాదు! నీవు కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించు మరియు కృతజ్ఞులలో చేరిపో
وَمَا قَدَرُوا اللَّهَ حَقَّ قَدْرِهِ وَالْأَرْضُ جَمِيعًا قَبْضَتُهُ يَوْمَ الْقِيَامَةِ وَالسَّمَاوَاتُ مَطْوِيَّاتٌ بِيَمِينِهِ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
వారు అల్లాహ్ సామర్ధ్యాన్ని గుర్తించ వలసిన విధంగా గుర్తించలేదు; పునరుత్థాన దినమున భూమి అంతా ఆయన పిడికిలిలో ఉంటుంది; మరియు ఆకాశాలన్నీ చుట్టబడి ఆయన కుడిచేతిలో ఉంటాయి. ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు వారు కల్పించే భాగస్వాముల కంటే అత్యున్నతుడు
وَنُفِخَ فِي الصُّورِ فَصَعِقَ مَنْ فِي السَّمَاوَاتِ وَمَنْ فِي الْأَرْضِ إِلَّا مَنْ شَاءَ اللَّهُ ۖ ثُمَّ نُفِخَ فِيهِ أُخْرَىٰ فَإِذَا هُمْ قِيَامٌ يَنْظُرُونَ
మరియు బాకా (సూర్) ఊదబడినప్పుడు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న వారందరూ మూర్ఛిల్లి పడిపోతారు అల్లాహ్ కోరిన వారు తప్ప. ఆ తరువాత రెండవసారి (బాకా) ఊదబడుతుంది అప్పుడు వారందరూ లేచి చూడటం ప్రారంభిస్తారు
وَأَشْرَقَتِ الْأَرْضُ بِنُورِ رَبِّهَا وَوُضِعَ الْكِتَابُ وَجِيءَ بِالنَّبِيِّينَ وَالشُّهَدَاءِ وَقُضِيَ بَيْنَهُمْ بِالْحَقِّ وَهُمْ لَا يُظْلَمُونَ
మరియు భూమి తన ప్రభువు తేజస్సుతో వెలిగి పోతుంది మరియు కర్మపత్రం వారి యెదుట ఉంచబడుతుంది, ప్రవక్తలు మరియు (ఇతర) సాక్షులు రప్పింపబడతారు. మరియు వారి మధ్య న్యాయంగా తీర్పు చేయబడుతుంది మరియు వారికెట్టి అన్యాయం జరుగదు
وَوُفِّيَتْ كُلُّ نَفْسٍ مَا عَمِلَتْ وَهُوَ أَعْلَمُ بِمَا يَفْعَلُونَ
మరియు ప్రతి వ్యక్తి (ఆత్మ) తాను చేసిన కర్మలకు పూర్తి ప్రతిఫలం పొందుతాడు. ఎందుకంటే వారు చేస్తున్న దంతా ఆయనకు బాగా తెలుసు

Choose other languages: