Quran Apps in many lanuages:

Surah Az-Zamar Ayahs #60 Translated in Telugu

أَنْ تَقُولَ نَفْسٌ يَا حَسْرَتَا عَلَىٰ مَا فَرَّطْتُ فِي جَنْبِ اللَّهِ وَإِنْ كُنْتُ لَمِنَ السَّاخِرِينَ
లేకపోతే మానవుడు: నా పాడుగానూ! నేను అల్లాహ్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండకపోతే మరియు ఎగతాళి చేసేవారిలో చేరి ఉండకపోతే ఎంత బాగుండేది!" అని పశ్చాత్తాప పడవచ్చు
أَوْ تَقُولَ لَوْ أَنَّ اللَّهَ هَدَانِي لَكُنْتُ مِنَ الْمُتَّقِينَ
లేక, ఇలా అనవచ్చు: ఒకవేళ అల్లాహ్ నాకు సన్మార్గం చూపి వుంటే, నేను కూడా దైవభీతి గలవారిలో చేరిపోయేవాడిని కదా
أَوْ تَقُولَ حِينَ تَرَى الْعَذَابَ لَوْ أَنَّ لِي كَرَّةً فَأَكُونَ مِنَ الْمُحْسِنِينَ
లేక శిక్షను చూసి ఇలా అనవచ్చు: ఒకవేళ నాకు మరల (ఇహలోకానికి) పోయే అవకాశం దొరికి ఉంటే నేను తప్పక సజ్జనులలో చేరి పోయేవాడిని కదా
بَلَىٰ قَدْ جَاءَتْكَ آيَاتِي فَكَذَّبْتَ بِهَا وَاسْتَكْبَرْتَ وَكُنْتَ مِنَ الْكَافِرِينَ
(అప్పుడు అతనికి అల్లాహ్ ఇలా సెలవిస్తాడు): అలా కాదు! వాస్తవానికి నా సూచనలు (ఆయాత్) నీ వద్దకు వచ్చాయి. కాని నీవు వాటిని అబద్ధాలని తిరస్కరించావు మరియు గర్వానికి లోనయ్యావు మరియు నీవు సత్యతిరస్కారులలో చేరిపోయావు
وَيَوْمَ الْقِيَامَةِ تَرَى الَّذِينَ كَذَبُوا عَلَى اللَّهِ وُجُوهُهُمْ مُسْوَدَّةٌ ۚ أَلَيْسَ فِي جَهَنَّمَ مَثْوًى لِلْمُتَكَبِّرِينَ
మరియు పునరుత్థాన దినమున అల్లాహ్ పై అబద్ధాలు పలికిన వారి ముఖాలను నల్లగా మారిపోవటాన్ని నీవు గమనిస్తావు. ఏమీ? ఈ గర్విష్టుల నివాసం నరకంలోనే ఉండదా

Choose other languages: