Quran Apps in many lanuages:

Surah Az-Zamar Ayahs #58 Translated in Telugu

وَأَنِيبُوا إِلَىٰ رَبِّكُمْ وَأَسْلِمُوا لَهُ مِنْ قَبْلِ أَنْ يَأْتِيَكُمُ الْعَذَابُ ثُمَّ لَا تُنْصَرُونَ
మరియు మీరు పశ్చాత్తాపంతో మీ ప్రభువు వైపునకు మరలండి మరియు మీ పైకి శిక్ష రాకముందే, మీరు ఆయనకు విధేయులు (ముస్లింలు) అయి ఉండండి, తరువాత మీకు ఎలాంటి సహాయం లభించదు
وَاتَّبِعُوا أَحْسَنَ مَا أُنْزِلَ إِلَيْكُمْ مِنْ رَبِّكُمْ مِنْ قَبْلِ أَنْ يَأْتِيَكُمُ الْعَذَابُ بَغْتَةً وَأَنْتُمْ لَا تَشْعُرُونَ
మరియు మీకు తెలియకుండానే అకస్మాత్తుగా, మీపైకి శిక్ష రాకముందే మీ ప్రభువు తరఫు నుండి మీ కొరకు అవతరింప జేయబడిన శ్రేష్ఠమైన దానిని (ఈ ఖుర్ఆన్ ను) అనుసరించండి
أَنْ تَقُولَ نَفْسٌ يَا حَسْرَتَا عَلَىٰ مَا فَرَّطْتُ فِي جَنْبِ اللَّهِ وَإِنْ كُنْتُ لَمِنَ السَّاخِرِينَ
లేకపోతే మానవుడు: నా పాడుగానూ! నేను అల్లాహ్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండకపోతే మరియు ఎగతాళి చేసేవారిలో చేరి ఉండకపోతే ఎంత బాగుండేది!" అని పశ్చాత్తాప పడవచ్చు
أَوْ تَقُولَ لَوْ أَنَّ اللَّهَ هَدَانِي لَكُنْتُ مِنَ الْمُتَّقِينَ
లేక, ఇలా అనవచ్చు: ఒకవేళ అల్లాహ్ నాకు సన్మార్గం చూపి వుంటే, నేను కూడా దైవభీతి గలవారిలో చేరిపోయేవాడిని కదా
أَوْ تَقُولَ حِينَ تَرَى الْعَذَابَ لَوْ أَنَّ لِي كَرَّةً فَأَكُونَ مِنَ الْمُحْسِنِينَ
లేక శిక్షను చూసి ఇలా అనవచ్చు: ఒకవేళ నాకు మరల (ఇహలోకానికి) పోయే అవకాశం దొరికి ఉంటే నేను తప్పక సజ్జనులలో చేరి పోయేవాడిని కదా

Choose other languages: