Quran Apps in many lanuages:

Surah Az-Zamar Ayahs #49 Translated in Telugu

وَإِذَا ذُكِرَ اللَّهُ وَحْدَهُ اشْمَأَزَّتْ قُلُوبُ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ ۖ وَإِذَا ذُكِرَ الَّذِينَ مِنْ دُونِهِ إِذَا هُمْ يَسْتَبْشِرُونَ
మరియు ఒకవేళ అద్వితీయుడైన అల్లాహ్ ను గురించి ప్రస్తావన జరిగినపుడు, పరలోకాన్ని విశ్వసించని వారి హృదయాలు క్రుంగిపోతాయి. మరియు ఒకవేళ ఆయన తప్ప ఇతరుల ప్రస్తావన జరిగినపుడు వారు సంతోషంతో పొంగిపోతారు
قُلِ اللَّهُمَّ فَاطِرَ السَّمَاوَاتِ وَالْأَرْضِ عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ أَنْتَ تَحْكُمُ بَيْنَ عِبَادِكَ فِي مَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ
ఇలా అను: ఓ అల్లాహ్! భూమ్యాకాశాల సృష్టికి మాలాధారుడా! అగోచర గోచరాలను ఎరిగినవాడా! నీవే నీ దాసుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను గురించి తీర్పు చేసేవాడవు
وَلَوْ أَنَّ لِلَّذِينَ ظَلَمُوا مَا فِي الْأَرْضِ جَمِيعًا وَمِثْلَهُ مَعَهُ لَافْتَدَوْا بِهِ مِنْ سُوءِ الْعَذَابِ يَوْمَ الْقِيَامَةِ ۚ وَبَدَا لَهُمْ مِنَ اللَّهِ مَا لَمْ يَكُونُوا يَحْتَسِبُونَ
మరియు ఒకవేళ వాస్తవానికి ఈ దుర్మార్గుల వద్ద భూమిలో ఉన్న సమస్తమూ మరియు దానితో పాటు దానంత (రెట్టింపు) సంపద ఉన్నా పునరుత్థాన దినపు ఘోరశిక్ష నుండి తప్పించుకోవటానికి, వారు దానిని పరిహారంగా ఇవ్వగోరుతారు. ఎందుకంటే! అల్లాహ్ తరఫు నుండి వారి ముందు, వారు ఎన్నడూ లెక్కించనిదంతా ప్రత్యక్షమవుతుంది
وَبَدَا لَهُمْ سَيِّئَاتُ مَا كَسَبُوا وَحَاقَ بِهِمْ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
మరియు వారు చేసి వున్న దుష్టకార్యాలన్నీ స్పష్టంగా వారి ముందుకు వస్తాయి. మరియు వారు ఎగతాళి చేస్తూ వచ్చిందే వారిని చుట్టుకుంటుంది
فَإِذَا مَسَّ الْإِنْسَانَ ضُرٌّ دَعَانَا ثُمَّ إِذَا خَوَّلْنَاهُ نِعْمَةً مِنَّا قَالَ إِنَّمَا أُوتِيتُهُ عَلَىٰ عِلْمٍ ۚ بَلْ هِيَ فِتْنَةٌ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
ఒకవేళ మానవునికి ఆపద వస్తే అతడు మమ్మల్ని వేడుకుంటాడు. ఆ తరువాత మేము మా దిక్కు నుండి అతనికి అనుగ్రహాన్ని ప్రసాదిస్తే అతడు: నిశ్చయంగా, ఇది నాకున్న తెలివి వల్ల నాకు ఇవ్వబడింది!" అని అంటాడు. వాస్తవానికి, అది ఒక పరీక్ష, కాని చాలా మంది ఇది తెలుసుకోలేరు

Choose other languages: