Quran Apps in many lanuages:

Surah Az-Zamar Ayahs #40 Translated in Telugu

أَلَيْسَ اللَّهُ بِكَافٍ عَبْدَهُ ۖ وَيُخَوِّفُونَكَ بِالَّذِينَ مِنْ دُونِهِ ۚ وَمَنْ يُضْلِلِ اللَّهُ فَمَا لَهُ مِنْ هَادٍ
ఏమిటి? అల్లాహ్ తన దాసునికి చాలడా? అయినా వారు ఆయన (అల్లాహ్) ను విడిచి, ఇతరులను గురించి నిన్ను భయపెడు తున్నారు. మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడనిచ్చిన వానికి మార్గదర్శకుడు ఎవ్వడూ ఉండడు
وَمَنْ يَهْدِ اللَّهُ فَمَا لَهُ مِنْ مُضِلٍّ ۗ أَلَيْسَ اللَّهُ بِعَزِيزٍ ذِي انْتِقَامٍ
మరియు అల్లాహ్ మార్గదర్శకత్వం చేసిన వానిని, మార్గభ్రష్టుడు చేయగల వాడెవ్వడూ లేడు! ఏమీ? అల్లాహ్ సర్వశక్తిమంతుడు, ప్రతీకారం చేయగలవాడు కాడా
وَلَئِنْ سَأَلْتَهُمْ مَنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ اللَّهُ ۚ قُلْ أَفَرَأَيْتُمْ مَا تَدْعُونَ مِنْ دُونِ اللَّهِ إِنْ أَرَادَنِيَ اللَّهُ بِضُرٍّ هَلْ هُنَّ كَاشِفَاتُ ضُرِّهِ أَوْ أَرَادَنِي بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكَاتُ رَحْمَتِهِ ۚ قُلْ حَسْبِيَ اللَّهُ ۖ عَلَيْهِ يَتَوَكَّلُ الْمُتَوَكِّلُونَ
మరియు ఒకవేళ నీవు వారితో: భూమ్యాకాశాలను సృష్టించింది ఎవరు?" అని అడిగితే, వారు నిశ్చయంగా: అల్లాహ్!" అని అంటారు. వారిని ఇలా అడుగు: ఏమీ? మీరు ఆలోచించరా? అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించేవి - అల్లాహ్ నాకు కీడు చేయదలచుకుంటే - ఆయన కీడు నుండి, నన్ను తప్పించగలవా? లేక, ఆయన (అల్లాహ్) నన్ను కరుణించగోరితే ఇవి ఆయన కారుణ్యాన్ని ఆపగలవా?" వారితో ఇంకా ఇలా అను: నాకు కేవలం అల్లాహ్ చాలు! ఆయన (అల్లాహ్) ను నమ్మేవారు (విశ్వాసులు), కేవలం ఆయన మీదే నమ్మక ముంచుకుంటారు
قُلْ يَا قَوْمِ اعْمَلُوا عَلَىٰ مَكَانَتِكُمْ إِنِّي عَامِلٌ ۖ فَسَوْفَ تَعْلَمُونَ
(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: ఓ నా జాతి ప్రజలారా! మీరు మీ ఇష్టప్రకారం మీ పని చేస్తూ ఉండండి; నిశ్చయంగా, నేనూ నా పని చేస్తూ ఉంటాను. తరువాత మీరు తెలుసుకోగలరు
مَنْ يَأْتِيهِ عَذَابٌ يُخْزِيهِ وَيَحِلُّ عَلَيْهِ عَذَابٌ مُقِيمٌ
(ఇహలోకంలో) ఎవరి మీద అవమానకరమైన శిక్ష వచ్చిపడుతుందో మరియు (పరలోక జీవితంలో) ఎవరి మీద శాశ్వతమైన శిక్ష పడనున్నదో

Choose other languages: