Quran Apps in many lanuages:

Surah Az-Zamar Ayahs #28 Translated in Telugu

أَفَمَنْ يَتَّقِي بِوَجْهِهِ سُوءَ الْعَذَابِ يَوْمَ الْقِيَامَةِ ۚ وَقِيلَ لِلظَّالِمِينَ ذُوقُوا مَا كُنْتُمْ تَكْسِبُونَ
ఏమీ? పునరుత్థాన దినవు కఠినమైన శిక్షను తన ముఖంతో కాపాడు కోవలసిన వాడు (స్వర్గంలో ప్రవేశించేవానితో సమానుడా)? మరియు (ఆ రోజు) దుర్మార్గులతో ఇలా అనబడుతుంది: మీరు సంపాదించిన దానిని రుచి చూడండి
كَذَّبَ الَّذِينَ مِنْ قَبْلِهِمْ فَأَتَاهُمُ الْعَذَابُ مِنْ حَيْثُ لَا يَشْعُرُونَ
వీరికి పూర్వమున్న వారు కూడా (అల్లాహ్ సందేశాలను) అబద్ధాలని తిరస్కరించారు, కాబట్టి వారు ఊహించలేని దిశ నుండి వారిపై శిక్ష వచ్చి పడింది
فَأَذَاقَهُمُ اللَّهُ الْخِزْيَ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ وَلَعَذَابُ الْآخِرَةِ أَكْبَرُ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ
ఈ విధంగా, అల్లాహ్ వారికి ఇహలోక జీవితంలో కూడా అవమానాన్ని రుచి చూపాడు. మరియు వారి పరలోక శిక్ష దీని కంటే ఎంతో ఘోరమైనదిగా ఉంటుంది. వారు ఇది గ్రహిస్తే ఎంత బాగుండేది
وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِي هَٰذَا الْقُرْآنِ مِنْ كُلِّ مَثَلٍ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ
మరియు వాస్తవానికి మేము ఈ ఖుర్ఆన్ లో ప్రజల కొరకు అనేక రకాల దృష్టాంతాలు పేర్కొన్నాము, బహుశా వారు గుణపాఠం నేర్చుకుంటారని
قُرْآنًا عَرَبِيًّا غَيْرَ ذِي عِوَجٍ لَعَلَّهُمْ يَتَّقُونَ
అరబ్బీ భాషలో ఉన్న ఈ ఖుర్ఆన్ ను, ఏ విధమైన వక్రత లేకుండా అవతరింప జేశాము; బహుశా వారు దైవభీతి కలిగి వుంటారని

Choose other languages: