Quran Apps in many lanuages:

Surah Az-Zamar Ayahs #18 Translated in Telugu

قُلِ اللَّهَ أَعْبُدُ مُخْلِصًا لَهُ دِينِي
(ఇంకా) ఇలా అను: నేను కేవలం అల్లాహ్ నే ఆరాధిస్తూ నా భక్తిని (ఆరాధనను) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకుంటాను
فَاعْبُدُوا مَا شِئْتُمْ مِنْ دُونِهِ ۗ قُلْ إِنَّ الْخَاسِرِينَ الَّذِينَ خَسِرُوا أَنْفُسَهُمْ وَأَهْلِيهِمْ يَوْمَ الْقِيَامَةِ ۗ أَلَا ذَٰلِكَ هُوَ الْخُسْرَانُ الْمُبِينُ
కావున మీరు ఆయనను వదలి మీకు ఇష్టమైన వారిని ఆరాధించండి!" ఇంకా ఇలా అను: పునరుత్థాన దినమున తమకు తాము మరియు తమ కుటుంబం వారికి నష్టం కలిగించుకున్న వారే నిశ్చయంగా నష్టపడ్డ వారు. వాస్తవానికి అదే స్పష్టమైన నష్టం
لَهُمْ مِنْ فَوْقِهِمْ ظُلَلٌ مِنَ النَّارِ وَمِنْ تَحْتِهِمْ ظُلَلٌ ۚ ذَٰلِكَ يُخَوِّفُ اللَّهُ بِهِ عِبَادَهُ ۚ يَا عِبَادِ فَاتَّقُونِ
వారిని, వారిపై నుండి అగ్ని జ్వాలలు క్రమ్ముకుంటాయి మరియు వారి క్రింది నుండి (అగ్ని జ్వాలలు) క్రమ్ముకుంటాయి. ఈ విధంగా, అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు: ఓ నా దాసులారా! నా పట్ల మాత్రమే భయభక్తులు కలిగి ఉండండి
وَالَّذِينَ اجْتَنَبُوا الطَّاغُوتَ أَنْ يَعْبُدُوهَا وَأَنَابُوا إِلَى اللَّهِ لَهُمُ الْبُشْرَىٰ ۚ فَبَشِّرْ عِبَادِ
మరియు ఎవరైతే కల్పిత దైవాలను (తాగూత్ లను) త్యజించి, వాటిని ఆరాధించకుండా, పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపునకు మరలుతారో! వారికి శుభవార్త ఉంది. కావున నా దాసులకు ఈ శుభవార్తను ఇవ్వు
الَّذِينَ يَسْتَمِعُونَ الْقَوْلَ فَيَتَّبِعُونَ أَحْسَنَهُ ۚ أُولَٰئِكَ الَّذِينَ هَدَاهُمُ اللَّهُ ۖ وَأُولَٰئِكَ هُمْ أُولُو الْأَلْبَابِ
ఎవరైతే మాటను శ్రద్ధగా విని, అందులోని ఉత్తమమైన దానిని అనుసరిస్తారో! అలాంటి వారే, అల్లాహ్ మార్గదర్శకత్వం పొందిన వారు మరియు అలాంటి వారే బుద్ధిమంతులు

Choose other languages: